News November 8, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి స్పెషల్ పోస్టర్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హీరోయిన్ కియారా అద్వానీకి చెందిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సరికొత్త లుక్‌లో ఆమె ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవనుంది. టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోతాయని సినీవర్గాలు భావిస్తున్నాయి.

Similar News

News November 14, 2025

భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే

image

బిహార్‌లో భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం వెల్లడైన ట్రెండ్స్‌లో 180+ సీట్లలో ముందంజలో ఉంది. ఎంజీబీ 59 సీట్లు, జేఎస్పీ 1, ఇతరులు 3 సీట్లలో లీడింగ్‌లో ఉన్నారు. జన్ శక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ 8,800 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మహువా స్థానంలో 1500 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: రౌండ్ల వారీగా ఆధిక్యాలు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో మొదటి 5 రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.
*ఫస్ట్ రౌండ్ మెజారిటీ: 47 ఓట్లు
*రెండో రౌండ్ మెజారిటీ: 2,947 ఓట్లు
*మూడో రౌండ్ మెజారిటీ: 3,100 ఓట్లు
*నాలుగో రౌండ్ మెజారిటీ: 3,100 ఓట్లు
*ఐదో రౌండ్ మెజారిటీ: 3,178 ఓట్లు
> 5 రౌండ్లు కలిపి 12వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించిన నవీన్ యాదవ్.

News November 14, 2025

65L ఓట్లు డిలీట్ చేశాక ఫలితాల్లో ఇంకేం ఆశిస్తాం: మాణిక్కం ఠాగూర్

image

బిహార్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘65 లక్షల ఓట్లను డిలీట్ చేశారు. అందులోనూ ప్రతిపక్షాలకు మద్దతిచ్చే ఓటర్లవే ఎక్కువ. అలాంటప్పుడు ఫలితాల రోజు ఇక ఏం ఆశిస్తాం. ఇలాంటి పరిస్థితులతో ప్రజాస్వామ్యం మనుగడ సాధించదు’ అని పేర్కొన్నారు. #SIR, #VoteChori హాష్‌ట్యాగ్స్ యాడ్ చేశారు. కాగా ఇప్పటిదాకా వెల్లడైన ట్రెండ్స్‌లో ఎన్డీయే 160+ సీట్లలో ముందంజలో ఉంది.