News May 15, 2024

ఆ వాహనాలకు రూ.10వేలు ఫైన్ వేసేలా స్పెషల్ సిస్టమ్!

image

దేశంలో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు పుణేకు చెందిన అధికారులు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కే వాహనాలకు జరిమానా విధించేలా పెట్రోల్ పంపుల వద్ద అధునాతన కెమెరాలను ఉపయోగించి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. సరైన సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇది రూ.10వేలు జరిమానా విధిస్తుంది. అమలు చేసేందుకు కాస్త సమయం పట్టొచ్చు.

Similar News

News January 11, 2025

నేతన్నల సంక్షేమానికి అభయహస్తం పథకం

image

TG: రాష్ట్రంలోని చేనేత, జౌళి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.168కోట్లతో అభయహస్తం పథకం ప్రకటించింది. నేతన్న పొదుపు నిధి కింద రూ.115Cr కేటాయించింది. చేనేత కార్మికులు ప్రతినెలా తమ జీతంలో 8% పొదుపు చేస్తే ప్రభుత్వం 16% జమ చేస్తుంది. కార్మికులు ఏ కారణంతో మరణించినా నామినీకి రూ.5L అందించేందుకు నేతన్న భద్రతకు రూ.9Cr కేటాయించింది. వస్త్ర ఉత్పత్తులకు వేతన మద్దతుకు నేతన్న భరోసా కింద రూ.44Cr వెచ్చించింది.

News January 11, 2025

గేమ్ ఛేంజర్ తొలిరోజు కలెక్షన్లు ఎన్నంటే?

image

రామ్‌‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నిన్న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు ఈ మూవీ రూ.47.13 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. తెలుగులో రూ.38Cr, హిందీలో రూ.7Cr, తమిళ్‌లో రూ.2Cr వసూలు చేసినట్లు తెలిపింది. మార్నింగ్ షోల్లో 55.82%, మ్యాట్నీలో 39.33%, ఈవెనింగ్ షోల్లో 50.53% ఆక్యుపెన్సీ నమోదు చేసిందని వెల్లడించింది. మరి మీరూ మూవీ చూశారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.

News January 11, 2025

నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

image

AP: మకర సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా శ్రీశైలంలో నేటి నుంచి ఈ నెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉ.8.45గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి స్వామి, అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి 17 వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, స్వామిఅమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు నిలిపివేశారు.