News August 25, 2024
శ్రీలంక క్రికెటర్ అరుదైన రికార్డు

ఇంగ్లండ్‌తో జరిగిన తొలిటెస్టులో శ్రీలంక ఓడినప్పటికీ ఆ జట్టు ప్లేయర్ కమిందు మెండిస్ అరుదైన రికార్డు సృష్టించారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ENG గడ్డపై సెంచరీ చేసిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా నిలిచారు. అలాగే ఏడు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు దిగి లెజెండరీ క్రికెటర్లు గిల్‌క్రిస్ట్ 7, కపిల్ దేవ్ 3 సెంచరీలు చేయగా, కమిందు తొలి నాలుగు టెస్టుల్లోనే మూడు శతకాలు బాది వారి సరసన చేరారు.
Similar News
News April 2, 2026
దేశమంతా అమరావతి వెంట నిలబడింది: CBN

AP: అమరావతి అత్యంత పవిత్ర స్థలమని CM CBN అభివర్ణించారు. ‘దేశంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా స్థలాల నుంచి మట్టిని, నదుల నుంచి జలాన్ని తెచ్చి పునీతం చేశాం. అలాంటి ఈ ప్రాంతాన్ని గత పాలకులు మూడుముక్కలాటతో విధ్వంసం చేశారు. కానీ ఇవాళ పార్లమెంటులో YCP తప్ప దేశంలోని అన్ని పార్టీలు అమరావతి వెంట నిలిచాయి’ అని ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించిన సభలో పేర్కొన్నారు. అమరావతిని వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామన్నారు.
News April 2, 2026
SRH బ్యాటింగ్.. జట్టులో మార్పు

IPL: SRHతో మ్యాచులో KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎషాన్ మలింగ స్థానంలో పైన్, హర్షల్ పటేల్ స్థానంలో శివాంగ్ కుమార్ SRHలోకి వచ్చారు.
SRH: అభిషేక్, హెడ్, కిషన్ (C), క్లాసెన్, అనికేత్, నితీశ్, సలీల్, హర్ష్ దూబే, ఉనద్కత్, పైన్, శివాంగ్ కుమార్.
KKR: రహానె (C), గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్‌దీప్, అనుకుల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, ముజరబాని.
News April 2, 2026
లేటుగా సూర్యోదయం.. త్వరగా సూర్యాస్తమయం!

TG: పెద్దపల్లి జిల్లా కొదురుపాక గ్రామం అరుదైన ప్రకృతి వింతకు నిలయం. ఈ ఊరికి నలువైపులా ఎత్తైన కొండలు ఉండటంతో ఇక్కడ 4PMకే చీకటి అలుముకుంటుంది. అందుకే దీనిని ‘మూడు జాముల కొదురుపాక’ అని పిలుస్తుంటారు. తూర్పున ఉన్న కొండల వల్ల సూర్యోదయం కూడా ఆలస్యంగానే అవుతుంది. ఈ వింతపై కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా తెరకెక్కడం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో (36/100)


