News June 13, 2024
రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం లాంటిది: వెంకయ్యనాయుడు
AP: రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం లాంటిందని పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం ఓ విలువైన పాఠమన్నారు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేదేం లేదని అమరావతి రైతులు నిరూపించారని అన్నారు. 1631 రోజుల శాంతియుత ఉద్యమం గొప్పదని పేర్కొన్నారు. చివరకు ప్రజల కోరిక నెరవేరడం సంతోషకరమని అన్నారు.
Similar News
News January 15, 2025
రోహిత్ పాకిస్థాన్‌కు వెళ్తాడు: బీసీసీఐ వర్గాలు
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్స్ ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌కు వెళ్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 29 ఏళ్ల తర్వాత పాక్ ఐసీసీ టోర్నీ నిర్వహిస్తోందని పేర్కొన్నాయి. ఒకవేళ హిట్ మ్యాన్ నిజంగానే పాక్‌కు వెళ్తే ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. ఫిబ్రవరి 19న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, భారత్VSపాక్ మ్యాచ్ 23న దుబాయిలో జరగనుంది.
News January 15, 2025
ఇందిరా భవన్‌కు కాదు లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతాం: కాంగ్రెస్
ఢిల్లీలోని తమ కొత్త హెడాఫీసుకు ఇందిరా భవన్ పేరునే కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ‘సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్’గా పేరుమార్చి ఆయన్ను గౌరవించాలని <<15160758>>BJP<<>> అడగటంపై స్పందించింది. ఇందిరా భవన్‌లోని లైబ్రరీకి మన్మోహన్ పేరు పెడతామని ప్రకటించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కలిసి కొత్త ఆఫీసును బుధవారం ఆరంభించిన సంగతి తెలిసిందే.
News January 15, 2025
హీరో జేడీ చక్రవర్తి ఇప్పుడెలా ఉన్నారో చూడండి!
ఒకప్పుడు టాలీవుడ్లో సూపర్ హిట్స్ పొందిన హీరో జేడీ చక్రవర్తి లేటెస్ట్ ఫొటో వైరలవుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆయనతో సెల్ఫీ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నేను, సత్య కలిసి సత్య సినిమా చూసేందుకు వెళ్తున్నాం’ అని ఆయన పోస్ట్ చేశారు. 1998లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో రీరిలీజ్ కానుంది.