News September 1, 2024

తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి 12.30-2.30 మధ్య తీరాన్ని దాటింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. లోతట్టు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Similar News

News February 1, 2025

కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది?

image

యావత్ దేశం మొత్తం ఎదురుచూసే బడ్జెట్ వచ్చేసింది. ₹50.65 లక్షల కోట్లతో పద్దులను నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. ₹12 లక్షల ఆదాయం వరకు పన్ను లేకపోవడం, క్యాన్సర్ సహా 36 ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ తొలగించడం, బీమా రంగంలో 100% FDI పెంచడం, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని ₹3 లక్షల నుంచి ₹5 లక్షలకు పెంచడం, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రకటనలు చేశారు. ఈ బడ్జెట్‌పై మీ కామెంట్ ప్లీజ్.

News February 1, 2025

AP పట్ల కేంద్రానికి ఇంతటి నిర్లక్ష్యమెందుకు?: జైరామ్ రమేశ్

image

కేంద్ర ప్రభుత్వం బిహార్‌కు బొనాంజా ప్రకటించి కూటమిలోనే భాగమైన ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం అత్యంత క్రూరంగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేశ్ ట్విటర్లో విమర్శించారు. ‘త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టి బిహార్‌కు కేంద్రం వరాలు కురిపించింది. అది సహజమే. కానీ ఎన్డీయేకు మూలస్తంభంలా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకంత క్రూరంగా నిర్లక్ష్యం చేసింది?’ అని ప్రశ్నించారు.

News February 1, 2025

తర్వాతి మ్యాచ్‌లో షమీని ఆడిస్తాం: మోర్కెల్

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా రేపు జరిగే ఆఖరి మ్యాచ్‌లో షమీని ఆడించనున్నట్లు భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపారు. ‘షమీ చాలా బాగా ఆడుతున్నారు. వార్మప్ గేమ్స్‌లో శరవేగంగా బౌలింగ్ చేస్తున్నారు. వచ్చే మ్యాచ్‌కి ఆయన్ను ఆడిస్తాం. ఆ అనుభవం యువ ఆటగాళ్లకు కీలకం’ అని పేర్కొన్నారు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ షమీకి భారత జట్టులో వరుస అవకాశాలివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.