News March 4, 2025

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు గతంలోనే చెప్పిన కల్పన

image

ప్రముఖ సింగర్ <<15653135>>కల్పన<<>> ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అయితే ఆమె గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. ‘2010లో భర్తతో విడిపోవడంతో కుంగిపోయాను. పిల్లల్ని చదివించాలి. చేతిలో అవకాశాలు లేవు. సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో చిత్రమ్మ ధైర్యం చెప్పి, నన్ను ఆ ఆలోచన నుంచి బయటపడేశారు’ అని అప్పట్లో కల్పన చెప్పుకొచ్చారు.

Similar News

News December 25, 2025

మహేశ్ న్యూ లుక్.. రాముడి పాత్ర కోసమే!

image

నిన్న మొన్నటి వరకు సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంగ్ హెయిర్, గడ్డంతో కాస్త రగ్గుడ్ లుక్‌లో కనిపించారు. ఇప్పుడు క్లీన్ షేవ్ చేసుకుని మిల్క్ బాయ్‌లా మారిపోయారు. వారణాసి మూవీలో ఆయన రాముడిగా కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తైందని <<18653569>>ప్రకాశ్ రాజ్<<>> ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కొత్త షెడ్యూల్‌లో రాముడి పాత్ర షూట్ కోసమే ఇలా గెటప్ మార్చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News December 25, 2025

2049 నాటికి అరుణాచల్‌ హస్తగతమే చైనా లక్ష్యం: US రిపోర్ట్

image

అరుణాచల్‌ను చైనా తన ‘కోర్ ఇంట్రెస్ట్’ జాబితాలో చేర్చినట్లు అమెరికా <<18660718>>నివేదిక<<>> వెల్లడించింది. 2049 నాటికి తైవాన్‌తో పాటు అరుణాచల్‌ను హస్తగతం చేసుకోవడమే ఆ దేశ లక్ష్యమని పేర్కొంది. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా.. డ్రాగన్ తన సైనిక బలాన్ని పెంచుతూ భారత్‌పై ఒత్తిడి తెస్తోందని తెలిపింది. అరుణాచల్ వాసుల పాస్‌పోర్ట్‌ల విషయంలో వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తుచేసింది.

News December 25, 2025

పశువులకు ‘జోన్స్’ వ్యాధి ఎలా సోకుతుంది?

image

పాడి పశువులు సాధారణంగా మురికినీరు, శుభ్రంగా లేని మేత తీసుకోవడం వల్ల జోన్స్ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి అన్ని రకాల పశువులకు సోకుతుంది. సాధారణంగా గేదెల్లో రెండు ఈతల తర్వాత ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లికి ఈ వ్యాధి ఉంటే పుట్టే దూడకు సోకుతుంది. దీంతోపాటు సహజ, కృత్రిమ సంపర్కం ద్వారా కూడా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది. సహజంగా పశువుల్లో రోగ నిరోధక శక్తి తగ్గినపుడు ఈ వ్యాధి వస్తుంది.