News October 13, 2024

ఉపాధి హామీ పనుల ప్రభావంపై అధ్యయనం

image

క్షేత్ర‌స్థాయిలో ఉపాధి హామీ ప‌థకం ప‌నితీరు, దాని ప్ర‌భావంపై అధ్య‌య‌నం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు నీతి ఆయోగ్ DMEO శాఖ అధ్యయ‌నానికి బిడ్లు ఆహ్వానించింది. వివిధ ద‌శ‌ల్లో క‌న్స‌ల్టెంట్ల‌ను ఎంపిక చేస్తారు. క్షేత్ర‌స్థాయిలో ఇంటింటి స‌ర్వే ద్వారా గ‌త ఐదు ఆర్థిక సంవత్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల ప్ర‌భావంపై క‌న్స‌ల్టెంట్ అధ్యయనం చేసి ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

Similar News

News November 22, 2025

ప.గో: జాతీయ స్థాయి యోగా పోటీలకు ఇరువురి ఎంపిక

image

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు బడుగు చంద్రశేఖర్ (మోదుగ గుంట), హెచ్. రమాదేవి (చెరుకువాడ) ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో గోవాలో జరగనున్న యోగా పోటీల్లో పాల్గోనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బడుగు చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి తెలిపారు.

News November 22, 2025

టుడే టాప్ న్యూస్

image

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి