News November 16, 2024
స్టైలిష్ బామ్మ

జాంబియా గ్రామీణ ప్రాంతానికి చెందిన మార్గరెట్ చోలా (లెజెండరీ గ్లామ్మా) అనే వృద్ధురాలు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారారు. ఆమె తన మనవరాలు డయానా కౌంబాతో కలిసి స్టైలిష్ డ్రెస్సులు ధరించిన ఫొటోలు పోస్ట్ చేశారు. దీంతో ఆమె స్టైలిష్ ఐకాన్‌గా మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తనను ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చోలా చెప్పుకొచ్చారు. ఆమె ఎలా రెడీ అవుతారో మీరూ చూసేయండి.
Similar News
News January 13, 2026
ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.
News January 13, 2026
పిల్లలపై పోసిన భోగి పళ్లను తినవచ్చా?

భోగి పళ్లను దిష్టి తీయడానికి పోస్తారు కాబట్టి తినొద్దని కొందరు అనుకుంటారు. అయితే వీటిని తినొచ్చని పండితులు సూచిస్తున్నారు. బదరీ ఫలాలను సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావిస్తారు కాబట్టి తిన్నా ఏ దోషం ఉండదని అంటున్నారు. అయినప్పటికీ అనుమానం ఉన్నా, తినడానికి ఇష్టం లేకపోయినా కొన్ని పండ్లను విడిగా ముందే పక్కకు తీసి పెట్టుకోవాలి. రేగుపళ్లలో సి-విటమిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
News January 13, 2026
ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% టారిఫ్: ట్రంప్

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త పథకం రచించారు. ఇరాన్‌తో వ్యాపారం చేయకుండా కొత్త టారిఫ్స్ తీసుకొచ్చారు. ఏ దేశాలైతే ఇరాన్‌తో వ్యాపారం చేస్తాయో.. అవి USతో బిజినెస్ చేయాలంటే 25% టారిఫ్స్ చెల్లించాల్సి ఉంటుంది అని ప్రకటించారు. ఈ నిర్ణయం ఇప్పుడే అమలులోకి వస్తుందని చెప్పారు. ఇది ఫైనల్ అంటూ కుండ బద్దలు కొట్టేశారు.


