News September 24, 2024
తెలుగులోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ

బాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచిన ‘కిల్’ మూవీ తెలుగులో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. లక్ష్య, తాన్య, రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ మూవీ జులై 5న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. సెప్టెంబర్ 6 నుంచి డిస్నీ+హాట్స్టార్లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఇవాళ్టి నుంచి తెలుగు, తమిళం వెర్షన్లలో కూడా అందుబాటులోకి రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
Similar News
News November 2, 2025
కాలీఫ్లవర్లో బటనింగ్ తెగులును ఇలా గుర్తించండి

కాలీఫ్లవర్ పంటలో చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బటనింగ్ అంటారు. ముదురు నారు నాటడం, నేలలో నత్రజని లోపం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజులు గల నారుని నాటుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను వేయాలి. స్వల్పకాలిక రకాలను సిఫారసు చేసిన సమయంలో విత్తడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News November 2, 2025
వంటింటి చిట్కాలు

* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* పచ్చి బటానీ ఉడికించేటప్పుడు కాస్త పంచదార వేస్తే వాటి రుచి పెరుగుతుంది.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వెయ్యడం వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.
News November 2, 2025
జోగి రమేశ్ అనుచరుడిని వదిలేసిన పోలీసులు

AP: జోగి రమేశ్ <<18175158>>అనుచరుడు<<>> ఆరేపల్లి రామును ఎక్సైజ్ పోలీసులు వదిలిపెట్టారు. తిరిగి తాము పిలిచినప్పుడూ విచారణకు రావాలని ఆదేశించినట్లు రాము తెలిపారు. రమేశ్ సోదరుడు జోగి రాము ఇళ్లు చూపించాలని ఎక్సైజ్ అధికారులు తనను తీసుకెళ్లారని పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్తో తనకు, జోగి రమేశ్కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పారు. జనార్దన్కు ఫోన్ చేసి మాట్లాడేంత పరిచయం రమేశ్కు లేదన్నారు.


