News September 6, 2024

OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ చిత్రం

image

బాలీవుడ్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘కిల్’ అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. లక్ష్ లల్వానీ, తాన్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 5న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌ అదిరిపోవడంతో ‘జాన్ విక్’ ఫేమ్ ఛార్లెస్ ఈ మూవీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. టొరంటో ఇంటర్నేషనల్, ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితమైంది.

Similar News

News November 6, 2025

బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

image

బిహార్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News November 6, 2025

ఉపఎన్నిక ప్రచారానికి కేసీఆర్ ఇక రానట్టేనా!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి KCR రానట్లేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నిక బాధ్యతను పూర్తిగా కేటీఆరే తీసుకున్నారు. ఇప్పుడు ప్రచార పర్వం రేవంత్ vs KTRగా వేడెక్కింది. తండ్రి మరణంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న హరీశ్ రావు ఈ 3 రోజులు యాక్టివ్ కానున్నారు. KCR ఒక్కసారి రావాలని పార్టీ క్యాడర్ ఆశిస్తున్నా… గెలుస్తామనే ధీమా, అనారోగ్యం కారణంగా ఆయన వచ్చే అవకాశం కనిపించడం లేదు.

News November 6, 2025

అల్లు అర్జున్ నుంచి భారీ ప్రాజెక్టులు!

image

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని పాన్ వరల్డ్ రేంజ్‌లో 2027లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బన్నీ ఏయే ప్రాజెక్టులు చేయబోతున్నారు అన్న దానిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ లిస్ట్‌లో సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను(సరైనోడు 2) పేర్లు వినిపిస్తున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ భారీగా ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.