News May 26, 2024
త్వరలో ఇజ్రాయెల్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్: హెజ్బొల్లా

త్వరలో తమ నుంచి ఇజ్రాయెల్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుందని ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా ప్రకటించింది. గాజాలో అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఇజ్రాయెల్ పాటించడం లేదని హెజ్బొల్లా ఆరోపించింది. ఐరోపా దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం ఇజ్రాయెల్‌కు పెద్ద దెబ్బ అని పేర్కొంది. కాగా సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.
Similar News
News January 21, 2026
అసలు ఏమిటీ ‘నైనీ కోల్ బ్లాక్’ వివాదం? 1/2

TGలో నైనీ కోల్ బ్లాక్ వివాదం పెనుదుమారం రేపుతోంది. ఒడిశాలోని నైనీలో ఉన్న బొగ్గు గనిని గతంలో కేంద్రం సింగరేణికి కేటాయించింది. తవ్వకాలకు సింగరేణి నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు ఈ నెల 29 వరకు గడువు విధించింది. అయితే నోటిఫికేషన్లో 1.8 నిబంధన ప్రకారం గని తవ్వాల్సిన ప్రాంతాన్ని సందర్శించి, అన్ని వివరాలు తెలుసుకున్నట్లు GM నుంచి తీసుకున్న ధ్రువపత్రాన్ని జత చేయాలని తెలిపింది. ఇక్కడే అసలైన వివాదం మొదలైంది.
News January 21, 2026
అసలు ఏమిటీ ‘నైనీ కోల్ బ్లాక్’ వివాదం? 2/2

TG: సింగరేణి నిబంధన ప్రకారం తాము నైనీ కోల్ బ్లాక్‌ను సందర్శించినా GM సర్టిఫికెట్ ఇవ్వలేదని, దీంతో టెండర్లలో పాల్గొనలేకపోతున్నామని కొన్ని కంపెనీలు ఆరోపించాయి. పలువురు మంత్రులు తమ వారికే టెండర్ ఇప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలూ గుప్పుమన్నాయి. దీంతో వివాదం ముదరడంతో Dy.CM భట్టి టెండర్ నోటిఫికేషన్ రద్దు చేశారు. ఇంతలో గొడవలోకి ఎంటరైన కేంద్రం ఇలా అయితే సింగరేణిని తామే నిర్వహిస్తామంటూ హెచ్చరించింది.
News January 21, 2026
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!

సరైన జీవనశైలితో అనారోగ్యాన్ని 90శాతం వరకూ దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి 3-4 సార్లు వ్యాయామం, ప్రతిరోజూ 10 వేల అడుగుల నడక గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని తెలిపారు. ‘సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే ఎండలో నిలబడటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. పోషకాహారం తీసుకోవడం, రోజుకు 3 లీటర్ల నీరు తాగడం ముఖ్యం. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది’ అని చెబుతున్నారు. share it


