News May 18, 2024

జగన్ పర్యటన వేళ అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్

image

AP: CM జగన్ విదేశీ పర్యటన వేళ గన్నవరం ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని వాషింగ్టన్‌కు చెందిన డా.తుళ్లూరు లోకేశ్‌గా గుర్తించారు. లోకేశ్‌కు US సిటిషన్‌షిప్ ఉందట. జగన్ పర్యటన వివరాలు అతని మొబైల్‌లో ఉండటంపై ప్రశ్నించగా గుండెపోటు వచ్చినట్లు చెప్పారు. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ఆ మెసేజ్‌లను ఎవరికి పంపారనే దానిపై విచారణ చేస్తున్నారు.

Similar News

News December 4, 2025

ASF: ఊపందుకున్న సోషల్ మీడియా ప్రచారం

image

ASF జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, పోస్టర్లను ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ఎవరి వర్గానికి వారు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

News December 4, 2025

ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

image

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<>ICSIL<<>>)6 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 9 వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in

News December 4, 2025

పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

image

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.