News July 6, 2024

గోవా వెళ్లే వారికి తీపి కబురు

image

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా)కు కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (17039/17040)ను ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైలు బుధ, శుక్రవారాల్లో SEC నుంచి.. గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్ తదితర స్టేషన్లలో ఆగుతుంది.

Similar News

News March 17, 2026

కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 41-61కి.మీ మధ్య గాలులు వీయడంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది.

News March 17, 2026

ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తా: జీవన్ రెడ్డి

image

TG: తాను <<19382690>>పార్టీ<<>> మారాలనుకునే ఆలోచనకు కారణం జగిత్యాల MLA సంజయ్ అని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో తనది 40 ఏళ్ల బంధమన్న ఆయన.. తనకు ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇంకా కాంగ్రెస్‌లోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. పార్టీ పిలుపు మేరకు 4 దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టానన్నారు. చూడాలి జగిత్యాలలో మున్ముందు ఏం జరుగుతుందో.

News March 17, 2026

టెస్టులకు సడన్‌గా రిటైర్మెంట్.. కారణం వెల్లడించిన అశ్విన్

image

టెస్టులకు సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంపై అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘టీమ్‌లో సీనియర్ బౌలర్ నేనుండగా పెర్త్ టెస్టులో(2024లో AUSతో) సుందర్‌ను ఆడించారు. అప్పుడే నా టైమ్ అయిపోయిందని గ్రహించా’ అని వెల్లడించారు. గంభీర్ అంటే తనకు ఇష్టమని, ఆయన వ్యక్తుల కంటే జట్టుకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. కోహ్లీ, రోహిత్, తాను ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకోలేదని, గెలుపు కోసమే ప్రయత్నించామన్నారు.