News August 19, 2024
టీచర్ పెళ్లి.. ప్రశ్నపత్రంలా శుభలేఖ

AP: తన పెళ్లి శుభలేఖ వినూత్నంగా ఉండాలని ఆలోచించారా టీచర్. వృత్తికి తగ్గట్లుగా ప్రశ్నపత్రం రూపంలో పెళ్లి పత్రికను ప్రింట్ చేయించారు. శుభలేఖను సింగిల్ ఆన్సర్, మల్టిపుల్ ఛాయిస్ అంటూ 8 ప్రశ్నలుగా విభజించారు. అందులో వరుడు, వధువు, కన్యాదానం చేసే వారి పేర్లు, పెళ్లి తేదీ, సమయం, మండపం, విందుకు సంబంధించిన ప్రశ్నలతో నింపేశారు. ప.గో(D) పెనుమంట్ర(మ) మార్టేరుకు చెందిన టీచర్ ప్రత్యూష పెళ్లి ఈ నెల 23న జరగనుంది.
Similar News
News November 12, 2025
బంద్ ఎఫెక్ట్.. విద్యార్థులకు షాక్!

TG: ప్రైవేట్ కాలేజీల <<18182444>>బంద్<<>>తో పరీక్షలకు దూరమైన ఫార్మసీ విద్యార్థులకు విద్యాశాఖ ఊహించని షాక్ ఇచ్చింది. సమ్మె సమయంలో నిర్వహించిన పరీక్షలు మళ్లీ నిర్వహించలేమని, సప్లిమెంటరీ రాసుకోవాలని స్పష్టం చేసింది. కాగా దీనిపై సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేస్తామని FATHI తెలిపింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఈ నెల 3 నుంచి 4 రోజుల పాటు ప్రైవేట్ కాలేజీలు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
News November 12, 2025
నోట్లు తీసుకొని.. ఓట్లు మరిచారు!

TG: జూబ్లీహిల్స్ బైఎలక్షన్లో 50శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. ప్రధాన పార్టీలు రూ.వందల కోట్లు పంచినట్లు తెలుస్తున్నా.. ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటర్లు ముఖం చాటేశారని ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల బస్తీవాసులు హక్కు వినియోగించుకోగా అపార్ట్మెంట్లలో ఉన్నవారు ఆసక్తి చూపలేదు. ఇక ఇక్కడ ఉంటూ వేరే ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవు లేకపోవడమూ పోలింగ్పై ప్రభావం చూపింది.
News November 12, 2025
హైపర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

ఈ పేరెంటింగ్ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల ప్రతి తప్పు, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతి అంశంలోనూ ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పులు చేస్తే అంగీకరించరు. దీంతో పిల్లలు కూడా వారిని అర్థం చేసుకోలేరు. ఇలా తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.


