News March 27, 2024
కన్నీళ్లు పెట్టించే ఘటన

TG: నారాయణపేట జిల్లా గోపాల్‌పేటలో హృదయవిదారక ఘటన జరిగింది. స్థానికుడు రమేశ్ కూతురు లక్ష్మీప్రణీత(13) హోలీరోజు మినీ వాటర్ ట్యాంకు కూలి మరణించింది. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన రమేశ్ స్నానం చేసి బయటికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతుక్కుంటూ వెళ్లారు. రమేశ్ తన కూతురిని పూడ్చిపెట్టిన స్థలం పక్కనే నిద్రిస్తూ కనిపించాడు. ఈ ఘటన చూసి అక్కడున్నవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Similar News
News November 19, 2025
అలంపూర్: వారసత్వ సంపదను పరిరక్షించండి- కలెక్టర్

అలంపూర్ కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వారసత్వ వారోత్సవాలు సంగమేశ్వర ఆలయ ప్రాంగణంలో చారిత్రక ఆలయాల గురించి తెలిపే చిత్ర ప్రదర్శనకు గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ చేతుల మీదుగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వారం పాటు జరిగే ఈ వారోత్సవాలు చారిత్రక కట్టడాలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలిపారు. కార్యక్రమంలో పురావస్తు సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ ఉన్నారు.
News November 19, 2025
ప్రజల సొమ్ముతో పక్క రాష్ట్రంలో జల్సాలు: YCP

AP: ప్రజల సొమ్ముతో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ స్పెషల్ ఫ్లైట్లలో జల్సాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ‘వీకెండ్ వస్తే చాలు స్పెషల్ ఫ్లైట్‌లో HYDకు వెళ్లిపోతారు. ఎవడి అబ్బ సొమ్ము అని ఇలా ప్రజాధనాన్ని తగలేస్తున్నారు చంద్రబాబూ? ఈ 17 నెలల్లో చంద్రబాబు 80సార్లు, లోకేశ్ 83సార్లు, పవన్ కళ్యాణ్ 104సార్లు HYDకి వెళ్లారు’ అని విమర్శలు గుప్పిస్తూ పైనున్న ఫొటోను Xలో పోస్ట్ చేసింది.
News November 19, 2025
ప్రమోటీ జుడీషియరీ ఆఫీసర్లకు జిల్లా జడ్జి పోస్టుల్లో కోటా ఉండదు: SC

సివిల్ జడ్జిలుగా ప్రమోటైన జుడీషియరీ ఆఫీసర్లకు జిల్లా జడ్జి పోస్టుల్లో కోటా ఉండదని SC పేర్కొంది. వారికి వెయిటేజీని తిరస్కరించింది. ఈమేరకు గైడ్‌లైన్స్ ప్రకటించింది. హయ్యర్ జుడీషియల్ సర్వీసుల్లో సీనియారిటీ నిర్ణయానికి ఏకీకృత వార్షిక రోస్టర్ రూపొందిస్తారు. రెగ్యులర్ ప్రమోషన్, డైరక్ట్ రిక్రూటీలకు ఎంట్రీ తేదీ ఆధారంగా సీనియార్టీ నిర్ణయిస్తారు. GOVTలు హైకోర్టులతో మాట్లాడి విధివిధానాలు రూపొందించాలి.


