News August 20, 2025
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి.. ఈ పార్టీలు ఎటువైపు?

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును INDI కూటమి ప్రకటించడం TDP, JSP, YCP, BRSలను ఇరకాటంలోకి నెట్టాయి. వెంకయ్య నాయుడు తర్వాత మరోసారి తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. కానీ APలో BJPతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన TDP, JSP పొత్తు ధర్మం పాటిస్తాయా? లేక తెలుగు వ్యక్తికి ఓటేస్తాయా అన్నది ఆసక్తికరం. YCP, BRS కూడా ఎటువైపు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.
Similar News
News August 20, 2025
IPL స్టార్స్ సుదర్శన్, ప్రసిద్ధ్‌కు బిగ్ షాక్

ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కానీ ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయి సుదర్శన్, పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసిద్ధ్ కృష్ణకు చోటు కల్పించలేదు. ఐపీఎల్ ప్రామాణికంగా వీరిని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది. కానీ టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ కోసం మాత్రం వారిని పట్టించుకోలేదు. కాగా గత సీజన్‌లో సుదర్శన్ 759 రన్స్ చేయగా ప్రసిద్ధ్ 25 వికెట్లు తీసి సత్తా చాటారు.
News August 20, 2025
పాఠ్య పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’

NCERT కీలక నిర్ణయం తీసుకుంది. 3-12వ తరగతి విద్యార్థుల పుస్తకాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని చేర్చింది. ఇందుకు సంబంధించి తాజాగా స్పెషల్ మాడ్యూళ్లు రిలీజ్ చేసింది. 3-8వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ సాగా ఆఫ్ వాల్యూర్(ఒక శౌర్య గాథ)’, 9-12వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఏ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ(ఒక గౌరవం&ధైర్యసాహసాలు)’ టైటిళ్లతో పాఠ్యాంశాలను తీసుకువచ్చింది. పహల్గామ్ అటాక్ ఇందులో పొందుపర్చింది.
News August 20, 2025
ఆగస్టు 20: చరిత్రలో ఈ రోజు

1828: బ్రహ్మసమాజాన్ని స్థాపించిన రాజా రామమోహనరాయ్
1931: తెలుగు దివంగత హాస్యనటుడు పద్మనాభం జననం
1944: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(ఫొటోలో)జననం
1946: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి జననం
1977: వాయేజర్-2 వ్యోమనౌకను లాంఛ్ చేసిన నాసా
1995: హీరోయిన్ కావ్య ధాపర్ జననం
* మలేరియా నివారణ దినోత్సవం
* అక్షయ్ ఉర్జా దినోత్సవం