News March 29, 2024
‘ఓం’ ఆకారంలో ఆలయం

ప్రపంచంలోనే తొలి ఓం ఆకారం ఆలయాన్ని రాజస్థాన్‌లో నిర్మించారు. దీన్ని పాలి జిల్లాలోని జదాన్ గ్రామంలో 250 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో 12 జ్యోతిర్లింగాలతో పాటు 1,008 శివుడి విగ్రహాలున్నాయి. 5వ శతాబ్దానికి చెందిన నాగర శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
Similar News
News December 5, 2025
అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్<<>>ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా తాజాగా రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు.
News December 5, 2025
టుడే టాప్ స్టోరీస్

*రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను రిసీవ్ చేసుకున్న ప్రధాని మోదీ
*హార్టికల్చర్ హబ్‌కి కేంద్రం రూ.40వేల కోట్లు ఇస్తోంది: చంద్రబాబు
*తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్
*ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం: రేవంత్
*’హిల్ట్’ పేరుతో కాంగ్రెస్ భూకుంభకోణం: KTR
*మరోసారి కనిష్ఠానికి రూపాయి.. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.90.43కి పతనం
News December 5, 2025
క్రియేటివ్ సిటీగా అమరావతి: చంద్రబాబు

AP: అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని, పచ్చదనంతో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలని CRDA భేటీలో CM CBN సూచించారు. మౌలిక సదుపాయాల కోసం నాబార్డు ₹7,380 కోట్ల రుణానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. నాణ్యతలో రాజీపడకుండా గడువుకన్నా ముందే నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.


