News May 20, 2024
ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్దామ్ జిల్లాలో ఉన్న కవర్ధాలో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 24, 2024
భారత్‌కు పాత్ పిచ్‌లు, ఆసీస్‌కు కొత్తవి.. క్యూరేటర్ ఏమన్నారంటే?
బాక్సింగ్ డే టెస్టుకు IND-AUS సిద్ధమవుతున్న వేళ ఓ వివాదం తెరమీదకు వచ్చింది. MCGలో భారత ప్లేయర్ల ప్రాక్టీస్ కోసం పాత పిచ్‌లు, ఆసీస్ కోసం కొత్త అందుబాటులో ఉంచినట్లు ఫొటోలు వైరలవుతున్నాయి. పాత పిచ్ కారణంగా ప్లేయర్లకు గాయాలైనట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై క్యూరేటర్ స్పందిస్తూ ‘మ్యాచ్‌కు 3 రోజుల ముందే కొత్త పిచ్ సిద్ధమవుతుంది. IND ప్రాక్టీస్ షెడ్యూల్ చాలా ముందుగా వచ్చింది’ అని పేర్కొన్నాడు.
News December 24, 2024
తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం.. 5న టోకెన్ల జారీ
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుపతి భక్తులకు జనవరి 5న టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు దర్శనం కల్పించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 7న దర్శనం కోసం 5వ తేదీన తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు జారీ చేయనుంది.
News December 24, 2024
సుమతీ నీతి పద్యం- ఎలాంటి గ్రామంలో నివసించాలి?
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును,ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ!
తాత్పర్యం: సమయానికి అప్పు ఇచ్చేవాడు, వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, పండితుడు ఉండే గ్రామంలో నివసించాలి. వారెవరూ లేని ఊరిలో నివసించకూడదు.