News August 26, 2024
ఘోర ప్రమాదం.. డ్యామ్ కూలి 60 మంది మృతి!

ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు తూర్పు ప్రాంతంలోని అర్బాత్ డ్యామ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 60 మంది మరణించి ఉంటారని, ఎంతో మంది గల్లంతయ్యారని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయని, సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
Similar News
News January 28, 2026
బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్టీలు సైలెంట్ 1/2

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లపై పార్టీలు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లాయి. రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉండడంతో పార్టీ పరంగా ఆమేరకు సీట్లు ఇస్తామని అవి ఇంతకు ముందు ప్రకటించాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ పార్టీ గుర్తులతో జరుగుతున్నా స్పందించడం లేదు. అధికారికంగా 32% సీట్లు BCలకు వస్తున్నందున అదనపు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నాయి. వాటి తీరుపై BCల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News January 28, 2026
బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్టీలు సైలెంట్ 2/2

TG: CM రేవంత్ విదేశాల్లో ఉండడంతో INCలో BCలకు 42% సీట్లపై PCC చీఫ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇక BRSలో వేరే పరిస్థితి. OC ఆధిపత్యం ఎక్కువ ఉన్నందున పార్టీలో ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉందని BC నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. BJPలో కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో బీసీ నేతలు ఆశలు పెట్టుకున్నా అధినేతల నుంచి రెస్పాన్స్ లేదంటున్నారు. MNP ఎన్నికల నామినేషన్ల గడువు ఈనెల 30తో ముగుస్తుంది.
News January 28, 2026
‘బారామతి’తో అజిత్ పవార్‌కు విడదీయరాని బంధం

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. బారామతితో ఆయనకు విడదీయరాని బంధముంది. అక్కడి ప్రజలను ఆయన తన సొంతం కుటుంబంగా అభివర్ణిస్తుంటారు. 1991 నుంచి 2024 ఎన్నికల వరకు బారామతి ప్రజలు ఆయన వెనుకే నడిచారు. పవార్ vs పవార్ వార్(2024)లోనూ అక్కడి ప్రజలు అజిత్‌కు లక్ష మెజారిటీ కట్టబెట్టారు. బారామతి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అదే మట్టిలో కలిసిపోయారు.


