News December 15, 2024

తల్లికి ‘పరీక్ష’.. పాపను ఆడించిన పోలీసులు

image

TG: మహబూబాబాద్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు ఓ మహిళ తన పాపతోపాటు వచ్చారు. ఆమెకు సంబంధించిన వారు కూడా ఎవరూ లేరు. దీంతో ఆమె పరీక్ష రాసేవరకూ ఆ పాపను పోలీసులే ఎత్తుకుని ఆడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసినవారు పోలీసులు మానవత్వం చాటుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు.

Similar News

News November 27, 2025

మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్‌: ములుగు ఎస్పీ

image

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో అమలవుతున్న మాస్టర్ ప్లాన్‌తో మరో పదేళ్ల వరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభిప్రాయ పడ్డారు. ఈసారి జాతరలో పది వేల మందికిపైగా పోలీసులు పనిచేస్తారని తెలిపారు. ట్రాఫిక్, క్రౌడ్, క్రైమ్ కంట్రోల్ కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తామన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.

News November 27, 2025

శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందా?.. క్లారిటీ ఇదే!

image

AP: ప్రముఖ యాంకర్ శివజ్యోతికి TTD షాక్ ఇచ్చిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె భవిష్యత్‌లో శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డును బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదు. TTD దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రీవారి ప్రసాదం తీసుకుంటూ ‘కాస్ట్లీ బిచ్చగాళ్లం’ అంటూ <<18363529>>వీడియో<<>> చేయడంతో ఈ దుమారం రేగింది. ఆమె ఆధార్ బ్లాక్ చేయాలని పలువురు కోరారు. కానీ TTD ఆ నిర్ణయం తీసుకోలేదు.

News November 27, 2025

గంభీర్‌ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు: గవాస్కర్

image

టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌కు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచారు. ప్లేయర్లను సిద్ధం చేయడమే కోచ్ పని అని, గ్రౌండ్‌లోకి దిగి ఆడాల్సింది ప్లేయర్లేనని స్పష్టం చేశారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు క్రెడిట్ ఇవ్వనప్పుడు, ఇప్పుడు మాత్రం ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? జవాబుదారీతనం ఎందుకు అడుగుతున్నారు? జీవితాంతం కోచ్‌గా ఉండాలని అతడు ట్రోఫీలు గెలిచినప్పుడు అడిగారా?’ అని నిలదీశారు.