News March 8, 2025
మహిళల పెట్టుబడుల్లో మూడో వంతు పిల్లలు, రిటైర్మెంటుకే..

ఫైనాన్షియల్ ఫ్యూచర్, ఇండిపెండెన్సీపై మహిళల ఆలోచనా తీరు మారింది. వారి పెట్టుబడుల్లో మూడో వంతు పిల్లలు, రిటైర్మెంటుకే కేటాయిస్తున్నారని డేటా చెబుతోంది. ప్రస్తుత FYలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న స్త్రీల సంఖ్య 18% పెరిగిందని పాలసీ బజార్ తెలిపింది. ఇందులో వేతన జీవులు 49%, హోమ్మేకర్స్ 39% అని పేర్కొంది. యంగర్ విమెన్ ఆర్థిక అంశాల్లో చురుగ్గా ఉంటున్నారని మణిపాల్ సిగ్నా రిపోర్ట్ వెల్లడించింది.
Similar News
News November 23, 2025
ఆస్ట్రేలియన్ ఓపెన్లో దుమ్మురేపిన లక్ష్యసేన్

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో అద్భుత విజయం సాధించారు. జపాన్ ఆటగాడు యూషీ తనాకాపై 21-15, 21-11 తేడాతో జయకేతనం ఎగరవేశారు. దీంతో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మూడో భారత ఆటగాడిగా లక్ష్య నిలిచారు. ఈ సీజన్లో అతనికి ఇదే తొలి BWF టైటిల్. అలాగే తన కెరీర్లో మూడో సూపర్ 500 టైటిల్.
News November 23, 2025
స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరుకావాలన్న స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు నేటితో గడువు ముగియనుండటంతో మరి కొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్కు లేఖ రాశారు. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు, తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేతలను ఆయన కలిసి చర్చించినట్లు సమాచారం.
News November 23, 2025
URDIPలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

CSIR-యూనిట్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్(URDIP) 3ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. కెమికల్/ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో పీజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత గల వారు డిసెంబర్ 16న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్సైట్: https://urdip.res.in/


