News September 20, 2024
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బంగ్లాకు ముప్పు?

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. చెన్నై టెస్టులో అరగంట ఎక్కువ కేటాయించినప్పటికీ బంగ్లా కేవలం 80 ఓవర్లు మాత్రమే వేసింది. ఐసీసీ నియమావళి ప్రకారం.. రౌండ్ స్టేజీలో ఒక్కో పెనాల్టీ ఓవర్‌కు ఒక పాయింట్ తగ్గిస్తారు. ఈ మ్యాచ్ అనంతరం అది జరిగితే బంగ్లా టెస్టు ఛాంపియన్‌షిప్ ముప్పులో పడినట్లే. గత నెలలోనే ఆ జట్టు 3 పాయింట్లను కోల్పోవడంతో పాటు 15శాతం మ్యాచ్ ఫీజు కోతను ఎదుర్కొంది.
Similar News
News January 11, 2026
కలుపు తీయని పైరు కర్ర చేయదు

పొలంలో కలుపును రైతులు సరైన సమయంలో గుర్తించి తొలగించకపోతే పంటకు అందాల్సిన పోషకాలను ఆ కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. దీని వల్ల పైరులో ఎదుగుదల లోపిస్తుంది. ఫలితంగా సరిగా గింజ పట్టదు లేదా బలమైన ‘కర్ర’ (కాండం)గా ఎదగదు. అలాగే ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలన్నా, ఒక వ్యక్తి గొప్పగా ఎదగాలన్నా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న అనవసరమైన విషయాలను, లోపాలను ఎప్పటికప్పుడు తొలగించుకొని ముందుకు సాగాలని ఈ సామెత తెలియజేస్తుంది.
News January 11, 2026
రేపు PSLV-C62 ప్రయోగం

AP: ISRO మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి రేపు ఉదయం 10.17 గంటలకు PSLV-C62 రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. కొత్త ఏడాదిలో ISROకు ఇదే తొలి ప్రయోగం. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఈరోజు మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రారంభించనున్నారు.
News January 11, 2026
బంగారం ధర రూ.2 లక్షలకు చేరనుందా?

2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు 2026లోనూ అదే పంథా కొనసాగించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,500 డాలర్లు ఉంది. ఇది మార్చి నాటికి 5,000 డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నట్లు HSBC కమోడిటీ పేర్కొంది. ఇక దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే రూ.1.41 లక్షల వద్ద ఉండగా, జూన్ నాటికి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.


