News April 17, 2025
IPL: మ్యాచ్ టై.. తొలి సూపర్ ఓవర్

DCvsRR మ్యాచ్ టైగా ముగిసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా స్టార్క్ అద్భుత బౌలింగ్ చేసి 8 పరుగులే ఇచ్చారు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. RR టాప్ ఆర్డర్ శాంసన్, జైస్వాల్, నితీశ్ రాణా రాణించినా ఆ జట్టు గెలవలేకపోయింది. కాసేపట్లో ఈ సీజన్‌లో తొలి సూపర్ ఓవర్ జరగనుంది.
Similar News
News January 19, 2026
సంపు ఏ దిశలో ఉంటే ఉత్తమం?

ఇంటి ప్రాంగణంలో బోరు, ఇంకుడు గుంతలు ఎక్కడున్నా, నీటిని నిల్వ చేసే ‘సంపు’ మాత్రం కచ్చితంగా ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశల్లోనే ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సంపు కట్టేటప్పుడు అది ఇంటి మూలకు, ప్రహరీ గోడ మూలకు తగలకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. వాస్తుతో పాటు నిర్మాణ భద్రత వంటి శాస్త్రీయ కోణాలను కూడా దృష్టిలో ఉంచుకుని సంపు నిర్మాణం చేపడితే మేలు జరుగుతుందని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 19, 2026
ట్రంప్ విషయంలో సొంత పాలకుల పరువు తీసిన పాక్ జర్నలిస్ట్!

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి పాక్ PM షరీఫ్, మిలిటరీ చీఫ్ మునీర్ ఆయన్ను 2సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. చివరకు వాళ్లకు వీసా బ్యాన్ బహుమతిగా దక్కింది. పాక్ పాలకుల ఈ వ్యూహాత్మక వైఫల్యాన్ని ఆ దేశంలో ప్రముఖ జర్నలిస్ట్ హమీద్ మీర్ బాహాటంగానే ఎండగట్టారు. పైగా ‘భారత్ ఎప్పుడూ ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేయలేదు. అమెరికా విధానాలపై తనదైన దూరం పాటిస్తుంది’ అంటూ చురకలంటించారు.
News January 19, 2026
RCET అభ్యర్థులకు FEB 2 నుంచి ఇంటర్వ్యూలు

AP: Ph.D కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన RCET-2024లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇవి FEB 6 వరకు జరగనున్నాయి. ఆంధ్రా, వెంకటేశ్వర, నాగార్జున, పద్మావతి యూనివర్సిటీలు, కాకినాడ, అనంతపురం JNTUలలో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని మండలి కార్యదర్శి తిరుపతి రావు పేర్కొన్నారు.


