News August 1, 2024
టికెట్ కలెక్టర్ ఒలింపిక్స్లో మెడల్ కొట్టాడు

ఇండియన్ రైల్వే టికెట్ కలెక్టర్ స్వప్నిల్ కుసాలే పారిస్ ఒలింపిక్స్లో <<13752961>>కాంస్యం<<>> సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. రెజ్లింగ్కు కంచుకోట అయిన కొల్హాపూర్(MH)కు చెందిన ఆయన షూటింగ్లో అదరగొట్టారు. రైల్వే TCగా పనిచేసిన ధోనీ అంటే తనకెంతో అభిమానమని కుసాలే నిన్న మీడియాతో చెప్పారు. ఆయనలా మైదానంలో ప్రశాంతంగా ఉండటం తన ఆటకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News January 19, 2026
గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్.. గ్యారంటీ లేకుండా ₹10 వేల లోన్!

డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల వంటి గిగ్ వర్కర్లు, డొమెస్టిక్ హెల్పర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ లోన్ స్కీమ్ను తెచ్చే యోచనలో ఉంది. PM-SVANidhi తరహాలో ఏప్రిల్ 2026 నుంచి వీరికి ₹10,000 వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా లోన్లు అందించే అవకాశం ఉంది. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదై యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. సకాలంలో చెల్లిస్తే ₹50,000 వరకు మళ్లీ లోన్ పొందే అవకాశం ఉంటుంది.
News January 19, 2026
రికార్డు స్థాయిలో పడిపోయిన చైనా జనాభా

చైనాలో వరుసగా నాలుగో ఏడాదీ జనాభా క్షీణించింది. 2025లో 33.9 లక్షలు తగ్గి 140.5 కోట్లకు చేరింది. జననాల రేటు 5.63గా నమోదై రికార్డుస్థాయికి పడిపోయింది. మరణాల రేటు మాత్రం 8.04తో 1968 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది. యువత పెళ్లిళ్లపై విముఖత చూపడం, పెరిగిన జీవనవ్యయం వల్ల దంపతులు పిల్లలు వద్దనుకోవడం ఇందుకు కారణాలు. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా, ‘ముగ్గురు పిల్లల’ విధానం తెచ్చినా మార్పు రాలేదు.


