News July 10, 2025

చేపల కోసం వల వేస్తే ‘టో ఫిష్’ చిక్కింది

image

AP: విశాఖకు చెందిన మత్స్యకారుడు అప్పన్న చేపల కోసం వల వేయగా ఎంతో విలువైన ‘టో ఫిష్’ పరికరం చిక్కింది. అదేంటో అర్థంకాక మత్స్యశాఖ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. వాళ్లకూ తెలియక నేవీ అధికారులకు చెప్పగా అది అత్యాధునిక ‘టో ఫిష్’ పరికరమని తేల్చారు. గతేడాది డిసెంబర్ నుంచి తమకు సిగ్నల్స్ తెగిపోవడంతో దాని కోసమే వెతుకుతున్నామని చెప్పారు. కాగా సముద్ర గర్భంలో అధ్యయనం చేసేందుకు ఈ పరికరాన్ని వాడుతారు.

Similar News

News July 10, 2025

PTM 2.0 కార్యక్రమాలు ఇవే

image

AP: మెగా <<17013073>>పేరెంట్స్-టీచర్స్ మీట్<<>> 2.0లో నిర్వహించే కార్యక్రమాలు ఇవే..
*విద్యార్థులు, పేరెంట్స్ ఫొటో సెషన్
*ప్రతి విద్యార్థి, పేరెంట్స్‌తో క్లాస్ టీచర్‌ సమావేశం
*తల్లికి వందనం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన
*తల్లులకు పుష్పాలిచ్చి పాదాభివందనం
*తల్లి పేరిట మొక్కలు నాటుతారు
*డ్రగ్స్, సైబర్ అవెర్‌నెస్ కార్యక్రమాలపై చర్చ
*అందరూ కలిసి సహపంక్తి భోజనం
*మ.ఒంటి గంట తర్వాత యథావిధిగా తరగతులు

News July 10, 2025

యూరియా అధికంగా వాడితే?

image

యూరియా కొరత నేపథ్యంలో దాన్ని సరఫరా చేస్తామంటూనే వాడకం తగ్గించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. పంట ఏపుగా పెరిగేందుకు యూరియాను అధికంగా వాడితే భూసారం తగ్గడంతో పాటు భవిష్యత్తులో దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యూరియా నుంచి వెలువడే అమ్మోనియాతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

News July 10, 2025

ఇవాళే ‘గురు పౌర్ణమి’.. ఎవరిని పూజించాలంటే?

image

ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వ్యాస మహర్షి జన్మదినాన్నే గురు పౌర్ణమిగా పిలుస్తారని పండితులు చెబుతున్నారు. గురువును పూజిస్తే తనని పూజించినట్లేనని స్వయంగా వ్యాస మహర్షే చెప్పారట. అందుకే గురు పౌర్ణమికి దక్షిణామూర్తి, దత్తాత్రేయ, రాఘవేంద్రస్వామి, సాయిబాబాని పూజించాలని జ్యోతిషులు చెబుతున్నారు. అలాగే ‘వ్యాం, వేదవ్యాసాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే పూజా ఫలితం దక్కుతుందట.