News January 28, 2025
గద్దర్ ఓ నరహంతకుడు: విష్ణువర్ధన్ రెడ్డి

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గద్దర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గద్దర్‌పై అనేక కేసులు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు తీసిన నరహంతకుడతను. ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకి. నిషేధిత మావోయిస్టు సంస్థలో పనిచేసిన గద్దర్‌కు అవార్డు ఎలా ఇవ్వమంటారు? అతడికి, ఎల్టీటీఈకి పెద్ద తేడా లేదు. రాజీవ్ గాంధీని బలితీసుకున్న ఎల్టీటీఈకి కూడా రేవంత్ పద్మ అవార్డులు ఇవ్వమంటారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 2, 2025
‘PM ఆవాస్ యోజన-NTR’ పథకానికి దరఖాస్తు గడువు పెంపు

AP: నవంబర్ 30తో ముగిసిన PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.
News December 2, 2025
పిల్లలను బేబీ వాకర్‌తో నడిపిస్తున్నారా?

పిల్లలు త్వరగా నడవాలని చాలామంది పేరెంట్స్ బేబీ వాకర్‌లో ఎక్కువసేపు కూర్చోబెడతారు. కానీ దీనివల్ల నష్టాలే ఎక్కువంటున్నారు నిపుణులు. ఎక్కువగా బేబీవాకర్‌లో ఉండటం వల్ల చిన్నారుల వెన్నెముక వంకరగా మారుతుందని చెబుతున్నారు. అలాగే దీనివల్ల కాళ్లు దూరంగా పెట్టి నడవడం అలవాటవుతుంది. బిడ్డ తనంతట తానుగా లేచి నడిస్తే మంచి సమతుల్యత ఉంటుంది. కాబట్టి వాకర్స్ వాడటం మంచిది కాదని సూచిస్తున్నారు.
News December 2, 2025
ఆ టీచర్లకు విద్యాశాఖ షాక్!

TG: సెలవు పెట్టకుండా విధులకు హాజరవ్వని టీచర్లపై కొరడా ఝుళిపించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. 30 రోజులు స్కూల్‌కు హాజరుకాకపోతే వారి ఇంటికే నోటీసులు పంపిస్తోంది. నోటీసులకు టీచర్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా FRS వచ్చాక టీచర్ల హాజరు శాతం పెరిగినట్లు సమాచారం. గత రెండేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా విధులకు హాజరుకాని 50 మంది టీచర్లను సర్వీస్ నుంచి విద్యాశాఖ తొలగించింది.


