News March 6, 2025

పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

image

AP: నటుడు పోసాని కృష్ణమురళి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు సూర్యారావుపేట, భవానీపురం, మన్యం(D) పాలకొండ పోలీసులు ఆయనపై PT వారెంట్లు జారీ చేస్తున్నారు. మరోవైపు ఆయన్ను విచారణ చేసేందుకు ఆదోని పోలీసులు కర్నూలు కోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేట, అన్నమయ్య జిల్లా ఓబులాపురం పోలీసులూ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.

Similar News

News December 6, 2025

బాపట్ల: విద్యార్థులకు గమనిక

image

ఆచార్య నాగర్జున యూనివర్సిటీలోని పలు సర్టిఫికెట్లకు విద్యార్థులు చెల్లించే ఫీజులను పెంచారు. ఈ మేరకు శుక్రవారం సీఈ శివప్రసాద రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఒరిజినల్ డిగ్రీ ఫీజు 2025లో ఉత్తీర్ణ సాధించిన వారికి సాధారణ ఫీజు రూ.1,200, తత్కాల్ రూ.4,450 గా నిర్ణయించారు. డూప్లికేట్ మార్కుల మెమో ఒక్కోదానికి గతంలో రూ.470 ఉండగా, ప్రస్తుతం రూ. 520కి పెరిగింది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News December 6, 2025

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు (2/2)

image

వైరస్ ఆశించిన కొన్ని కూరగాయల మొక్కల ఆకులు ముడతలు పడి, ముడుచుకొని, నిక్కబొడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కల్లో ఆహారోత్పత్తి తగ్గి వాడిపోయినట్లుగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి, పైకి కిందికి ముడుచుకొని వికారంగా మారతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి, కణుపుల మధ్యదూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయకట్టడం తగ్గుతుంది.

News December 6, 2025

స్ఫూర్తిని రగిలించే డా.అంబేడ్కర్ మాటలు

image

➛ ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం
➛ మేకల్ని బలి ఇస్తారు. పులుల్ని కాదు. పులుల్లా బతకండి
➛ మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే
➛ ప్రజలకు ఓటు హక్కే ఆయుధం. పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలవుతారో వారి చేతుల్లోనే ఉంది
➛ విశ్వాసం కలిగి ఉండండి. ఆశను కోల్పోకండి
* ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి *