News July 6, 2024

రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు

image

TG: తనను మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై <<13570128>>ఫిర్యాదు<<>> చేసిన లావణ్యకే రివర్స్‌లో నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఆమెకు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. అయితే ప్రస్తుతం ఆమె అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. అటు ఆమె ఆరోపణల్లో నిజం లేదని హీరో రాజ్‌తరుణ్ నిన్న స్పందించారు. ఆమె తనను చాలా టార్చర్ చేసిందని మీడియాతో చెప్పారు.

Similar News

News March 26, 2026

సిటీలోనే సమస్య.. మిగతా ప్రాంతాల్లో సాఫీగా..

image

హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్‌కు సమస్య లేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఒక్క పెట్రోల్ బంకులోనూ క్యూ లేదని, అన్ని చోట్లా స్టాక్ ఉందని చెబుతున్నారు. CNGకి కూడా ఇబ్బంది లేదంటున్నారు. పానిక్ బయింగ్‌తో కేవలం సిటీలోని బంకుల వద్దే క్యూలు, నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందో ప్రాంతం పేరుతో సహా కామెంట్ చేయండి.

News March 26, 2026

RCBకి కొత్త ఓనర్లు.. విజయ్ మాల్యా అభినందనలు

image

RCB కొత్త యజమానులకు ఒకప్పటి ఓనర్, వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. 2008లో ₹450కోట్లు పెట్టి ఈ ఫ్రాంచైజీ కొన్నప్పుడు అందరూ నవ్వుకున్నారని.. కానీ అదే ₹16,500Cr విలువైన బ్రాండ్‌గా ఎదిగినందుకు సంతోషంగా ఉందన్నారు. RCB ఎప్పటికీ తన డీఎన్ఏలో భాగమని.. యువ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం చెరగని జ్ఞాపకమని అన్నారు. తన హయాంలో, ఆ తర్వాతా RCBకి మద్దతు ఇచ్చిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

News March 26, 2026

‘హంద్రీ-నీవా’ రెండో దశకు గ్రీన్ సిగ్నల్

image

AP: హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో నాబార్డు/రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.1,184 కోట్లతో పనులు చేపట్టాలని సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. ఈ నిధులతో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, కాల్వల విస్తరణ, ప్రధాన కాల్వల పునరుద్ధరణ, ఆధునికీకరణ, ఇతర నిర్మాణ పనులు చేపట్టనున్నారు.