News November 18, 2024

తాను చనిపోయినా.. నలుగురికి ప్రాణం పోసిన రెండేళ్ల బాలుడు

image

కెన్యాకు చెందిన రెండేళ్ల లుండా యుంబా చనిపోతూ భారత్‌లోని నలుగురికి ప్రాణం పోశారు. రెండో అంతస్తు నుంచి పడిపోవడంతో లుండా తలకు గాయం అయింది. చికిత్స పొందుతూ అక్టోబర్ 26న బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందారు. దీంతో అతని అవయవాలు దానం చేసేందుకు లుండా తల్లి ముందుకొచ్చారు. ఇండియాలో పాంక్రియాస్ గ్రంథి దానం చేసిన అత్యంత పిన్న వయస్కుడు లుండానే. చండీగఢ్‌లోని PGI ఆస్పత్రి వైద్యులు లుండాకు ఘన నివాళులర్పించారు.

Similar News

News October 25, 2025

డ్రగ్స్ కేసు.. సినీ నటులకు ఈడీ సమన్లు

image

డ్రగ్స్ కొనుగోలు కేసులో సినీ నటులు <<16798985>>శ్రీరామ్<<>>(శ్రీకాంత్), కృష్ణకు ఈడీ సమన్లు జారీ చేసింది. జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి మత్తు పదార్థాలు సప్లై చేసినందుకు జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో వీరి హస్తం ఉందని విచారణలో తేలడంతో అరెస్టు చేయగా జుడీషియల్ రిమాండ్ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు EDకి చేరడంతో ఈ నెల 28న శ్రీకాంత్, 29న నటుడు కృష్ణ దర్యాప్తునకు రావాలని కోరింది.

News October 25, 2025

సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

image

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్‌-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్‌ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.

News October 25, 2025

వచ్చే నెల నుంచి అందుబాటులోకి ‘భారత్ టాక్సీ’

image

ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా కేంద్రం ‘భారత్ టాక్సీ’ని తీసుకురానుంది. వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి 25% చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డ్రైవర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఢిల్లీలో విజయవంతమైతే డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.