News June 10, 2024
కొరియా సరిహద్దుల్లో ‘లౌడ్‌స్పీకర్ల’ యుద్ధం

ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల <<13339163>>బెలూన్లతో<<>> చెత్త జారవిడుస్తూ ప్రతీకారాలు తీర్చుకోగా, ఇప్పుడు లౌడ్ స్పీకర్లతో యుద్ధం మొదలైంది. నార్త్ కొరియాలో రేడియో, టీవీ ప్రసారాలు లేకపోవడంతో సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్లను ఏర్పాటుచేసి ఆ దేశానికి వ్యతిరేకంగా సౌత్ కొరియా ప్రసారాలు ప్రారంభించింది. దీన్ని అడ్డుకోకపోతే చాలా తీవ్రంగా స్పందిస్తామని కిమ్ సోదరి యో జింగ్ హెచ్చరించారు.
Similar News
News September 10, 2025
చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (A-38)కి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. గతంలోనూ చెవిరెడ్డి పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. కాగా ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరైంది.
News September 10, 2025
62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది: ఉపరాష్ట్రపతి తల్లి

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికవడం పట్ల ఆమె తల్లి జానకీ అమ్మాల్ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన లాగే నేను కూడా టీచర్‌గా పనిచేశాను. ఆయన పేరునే నా కుమారుడికి పెట్టాను. ఏదో ఒక రోజు తను ప్రెసిడెంట్ అవ్వాలనే ఆ పేరు పెడుతున్నావా అని నా భర్త అడిగారు. 62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
News September 10, 2025
సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం: చంద్రబాబు

ఈ ఏడాది రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదైనా అన్ని చెరువులకు నీళ్లు వచ్చాయని CM చంద్రబాబు అనంతపురంలో చెప్పారు. ‘హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు TDP హయాంలోనే వచ్చాయి. డ్రిప్ ఇరిగేషన్, ప్రాజెక్టులతో ఎడారి నేలకు జీవం పోశాం. కియా కార్ల పరిశ్రమ తెచ్చాం. రూ.3,850 కోట్లతో హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకెళ్లాం. సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం. ఇది CBN మాట’ అని తెలిపారు.