News November 22, 2024
శాసనమండలిలో మాటల యుద్ధం
AP: శాసనమండలిలో EBC రిజర్వేషన్లపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత ప్రభుత్వ DBT విధానం వల్ల చాలామంది గంజాయి బారినపడ్డారని మంత్రి సవిత అన్నారని, ఆమె ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇరుపక్షాలు వాదనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, రికార్డుల నుంచి వాటిని తొలగిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
Similar News
News November 22, 2024
రెచ్చిపోతున్న హిజ్రాలు!
HYDలో హిజ్రాల దోపిడీ మితిమీరుతోందని, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, షాప్ ఓపెనింగ్స్.. ఇలా శుభకార్యమేదైనా వేలకు వేలు దండుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇళ్లల్లో రూ.30వేలు తీసుకున్నారని ఓ నెటిజన్ వాపోయారు. ఎక్కడ ఫంక్షన్ జరిగినా వాళ్లకెలా తెలుస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరి మీకూ హిజ్రాలతో ఇలాంటి అనుభవం ఎదురైందా?
News November 22, 2024
విమానాల పైనుంచి దూసుకెళ్లిన ఇరాన్ మిస్సైల్స్?
గత నెలలో ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన 200 ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ పౌర విమానాల పైనుంచి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానాల్లో ప్రయాణిస్తున్న కొందరు పైలట్లు, ప్రయాణికులు నిప్పులు చిమ్ముతూ వెళ్తున్న మిస్సైళ్లను చూసినట్లు సమాచారం. ఈ మిస్సైళ్లతో పదుల సంఖ్యలో విమానాలకు పెనుముప్పు తప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో పౌర విమానాలకు ఇరాన్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
News November 22, 2024
అదానీ గ్రూప్‌పై విచారణ ప్రారంభించిన సెబీ!
అదానీ గ్రీన్ ఎనర్జీపై అమెరికా న్యాయ శాఖ ఆరోపణల నేపథ్యంలో SEBI విచారణ ప్రారంభించినట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్స్‌ఛేంజీలకు అదానీ గ్రూప్ సమాచారం ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందా? అనే అంశంపై విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారుల నుంచి వివరణ కోరినట్టు CNBC TV18 తెలిపింది. రెండు వారాలపాటు నిజనిర్ధారణ అనంతరం అధికారిక దర్యాప్తుపై నిర్ణయించనుంది.