News October 26, 2024

అమెరికాలో లోకేశ్‌కు ఘన స్వాగతం

image

APకి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా వెళ్లిన మంత్రి లోకేశ్‌కు శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. నవంబర్ 1 వరకు అమెరికాలోనే ఉండనున్న మంత్రి రేపటి నుంచి పలు ఐటీ, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని వారికి వివరించనున్నారు. ఈ నెల 29న లాస్ వేగాస్‌లో జరిగే ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరవుతారు.

Similar News

News October 26, 2024

క్వాలిటీ టెస్టులో ఈ మందులు ఫెయిల్

image

49 రకాల మందులు క్వాలిటీ స్టాండర్డ్స్‌లో ఫెయిల్ అయ్యాయని CDSCO తెలిపింది. వీటిలో క్యాల్షియం-500mg, విటమిన్ D3(లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ లేబొరేటరీ ), పారాసిటమోల్(కర్ణాటక యాంటిబయాటిక్స్), మెట్రోనిడజోల్(హిందూస్థాన్ యాంటీబయాటిక్స్), డొంపరిడోన్(రైన్‌బో లైఫ్ సైన్సెస్), పాన్-40(ఆల్కెమ్ ల్యాబ్స్) తదితర మెడిసిన్ ఉన్నట్లు వెల్లడించింది. నకిలీ కంపెనీలు తయారుచేసిన 4 రకాల మందులను గుర్తించినట్లూ తెలిపింది.

News October 26, 2024

తొలి ప్రదర్శనకే బెస్ట్ యాక్టర్‌గా గుర్తింపు: మెగాస్టార్

image

మెగాస్టార్ చిరంజీవి తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. తాను రంగస్థలం మీద వేసిన తొలినాటకం ‘రాజీనామా’కు బెస్ట్ యాక్టర్‌గా తొలిసారి గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. ‘కోన గోవింద రావు గారు రచించిన రాజీనామా నాటకానికి బెస్ట్ యాక్టర్‌గా గుర్తింపు రావడం ఎనలేని ప్రోత్సాహాన్నిచ్చింది. 1974 -2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానంలో ఎనలేని ఆనందం పొందాను’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

News October 26, 2024

మరికొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తా: ధోనీ

image

MS ధోనీ IPLలో కొనసాగుతారా? లేదా? అనే దానిపై సస్పెన్స్ వీడింది. తాను వచ్చే IPLలో ఆడుతానని MSD స్పష్టం చేశారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ధోనీ తాను మరికొన్నేళ్లు క్రికెట్‌ను ఆస్వాదిస్తానని చెప్పారు. మైదానంలో ప్రొఫెషనల్ గేమ్‌గా ఆడితేనే విజయం సాధించగలమని అన్నారు. T20WC ఫైనల్ మ్యాచ్‌పై స్పందిస్తూ క్రికెట్లో చివరి వరకూ ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కాగా తలా తాజా వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.