News August 11, 2024
థియేటర్లో పెళ్లి.. స్పందించిన డైరెక్టర్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘మురారి’ మూవీ రీరిలీజ్‌లో దుమ్మురేపుతోంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో మురారి ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్లో ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. దీనిపై కృష్ణవంశీ ఘాటుగా స్పందించారు. ‘ఇది చాలా చెత్త నిర్ణయం. మన సంస్కృతి, సంప్రదాయాలను అవమానించడమే. దయచేసి ఇలాంటివి మళ్లీ రిపీట్ చేయొద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News March 16, 2026
అంగన్వాడీలకు శుభవార్త

APలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర సంస్థ EESL వెల్లడించింది. తొలి దశలో 11,400 పంపిణీ చేశామని, మరో 44,346 కేంద్రాలకూ త్వరలోనే అందిస్తామని తెలిపింది. దీనివల్ల LPG వినియోగం తగ్గి ఏటా రూ.24 కోట్ల వరకు ఆదా అవుతుందని, 28వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని పేర్కొంది. అగ్నిప్రమాదాలు ఉండవని, సిబ్బంది సురక్షితంగా వంట చేసుకోవచ్చని వివరించింది.
News March 16, 2026
ఆస్కార్ అవార్డును అమ్ముకోవచ్చా.. దాని విలువెంత?

ఆస్కార్ అవార్డు గ్రహీతలకు ట్రోఫీ తప్ప ప్రత్యేకంగా నగదు బహుమతి అంటూ ఏమీ ఇవ్వరు. ఒక్కో ట్రోఫీ తయారీకి 400 డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే విజేతలు తమకు వచ్చిన బహుమతిని విక్రయించేందుకు వీలులేదు. అకాడమీకి 1 డాలర్‌కు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. 1951లో ఈ రూల్ తెచ్చారు. 1950కి ముందు ఇచ్చిన అవార్డులకు ఇది వర్తించదు. ఓ ఆస్కార్ అవార్డు అధికారిక విలువ $1 అయినా.. అది తెచ్చిపెట్టే ప్రతిష్ఠ ఎనలేనిది. ఏమంటారు?
News March 16, 2026
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.


