News March 20, 2024

వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్

image

TG: రాష్ట్రంలో ప్రస్తుతం గ్యారంటీల గారడీ మాత్రమే నడుస్తున్నదని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని పేర్కొన్నారు. అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటాయని తెలిపారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ చేసిన అప్పుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News July 7, 2025

సినీ హీరో మహేశ్‌బాబుకు నోటీసులు

image

TG: సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న హీరో మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులిచ్చింది. తమ వెంచర్‌కు అన్ని అనుమతులున్నాయని మహేశ్ ఫొటోతో ఉన్న బ్రౌచర్ చూసి బాలాపూర్‌లో ₹34.80లక్షలు పెట్టి స్థలం కొన్నామని ఇద్దరు ఫిర్యాదు చేశారు. లేఔట్ లేకపోవడంతో డబ్బు ఇవ్వమంటే సంస్థ ₹15లక్షలే ఇచ్చిందన్నారు. దీంతో ఇవాళ విచారణకు హాజరుకావాలని మహేశ్‌తో పాటు సంస్థను కమిషన్ ఆదేశించింది.

News July 7, 2025

‘నగరాలు’ కులస్థులకు BC-D కులపత్రాలు: సవిత

image

AP వ్యాప్తంగా ఉన్న నగరాలు సామాజిక వర్గీయులను BC-Dలుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ సామాజిక వర్గానికి చెందిన పలువురు మంత్రిని కలిసి దీనిపై వినతిపత్రం ఇచ్చారు. తమ వర్గీయులకు BC-D కాస్ట్ సర్టిఫికేట్ అందించాలనే GO ఉన్నా, కేవలం VZM, SKLM, విశాఖ, కృష్ణా జిల్లాల్లోనే ఇది అమలవుతోందని వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

News July 7, 2025

కాసేపట్లో వనమహోత్సవానికి సీఎం శ్రీకారం

image

TG: ‘వన మహోత్సవం’లో భాగంగా ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. వన మహోత్సవం కోసం 14,355 నర్సరీల్లో 20 కోట్ల మొక్కలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.