News March 17, 2024

బొబ్బిలిలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. బొబ్బిలి గొల్లవీధికి చెందిన పార్వతి ఆదివారం ఉదయం పూల్ బాగ్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొనటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 30, 2026

VZM: ‘సమీకృత కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమీకృత కుటుంబ సర్వేకు నగర ప్రజలు సహకరించాలని విజయనగరం నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమీకృత కుటుంబ సర్వే విషయంలో ప్రజలు అపోహలకు పోవద్దన్నారు. ప్రజలకు మరింత సంక్షేమ పథకాలు అందించేందుకే ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్వే బృందానికి కుటుంబ సభ్యులు యొక్క పూర్తీ వివరాలు తెలియజేయాలని కోరారు.

News January 30, 2026

రీసర్వేలో తప్పులు ఉండరాదు: VZM కలెక్టర్

image

రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారం, తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాల తయారీపై రాజాంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డిటీలు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు తదితర సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. రీ సర్వేలో జరిగిన తప్పులు ఉండరాదన్నారు.

News January 30, 2026

ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, అభివృద్ధి పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జేసీ ఎస్. సేధు మాధవన్ పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత, దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎస్ సమీక్షించారు. అధికార యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలన్నారు.