News May 20, 2024

VIRALగా మారిన మహిళా ఓటర్ అభ్యర్థన

image

కుల రాజకీయాలకు కేరాఫ్‌గా పేరున్న బిహార్‌లో ఓ మహిళా ఓటర్ అభ్యర్థన వైరల్‌ అవుతోంది. కులాంతర వివాహాలు సర్వసాధారణమైన ఈ రోజుల్లోనూ కులాలను బట్టి ఓట్లేయడమేంటని ఆమె ప్రశ్నించారు. ‘మనం డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ల కులాన్ని పట్టించుకోం. కిరాణం, కూరగాయల మార్కెట్లోనూ కులాలను పట్టించుకోం. లాయర్ అవసరమైనా కులం గురించి ఆరా తీయం. అలాంటి మనం ఎన్నికల విషయంలో కులాన్ని ఎందుకు పట్టించుకోవాలి?’ అని ప్రశ్నించారామె.

Similar News

News November 8, 2025

బుమ్రా కాదు.. వాళ్లిద్దరే డేంజర్: అశ్విన్

image

టీ20 ఫార్మాట్‌లో బుమ్రా కన్నా వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ప్రమాదమని టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘భారత్‌లో జరగబోయే T20 WCను గెలవాలనుకుంటే వాళ్లు చక్రవర్తి, అభిషేక్ శర్మ రూపంలోని అడ్డంకులను దాటాల్సిందే. వీరి కోసం ప్రత్యేక వ్యూహాలు రెడీ చేసుకుంటేనే ప్రత్యర్థులు గెలవగలరు. ఆసీస్ అభిషేక్ కోసం వాడుతున్న షార్ట్ బాల్ స్ట్రాటజీ బాగుంది. WCలోనూ వాళ్లు ఇదే వాడొచ్చు’ అని తెలిపారు.

News November 8, 2025

అసోసియేషన్ల తీరుతో నష్టపోతున్న క్రీడాకారులు!

image

AP: ఇటీవల DSCలో స్పోర్ట్స్‌ కోటా కింద కొందరు ఉద్యోగానికి అనర్హులయ్యారు. గుర్తింపులేని అసోసియేషన్లతోనే క్రీడాకారులు నష్టపోతున్నారని శాప్ తెలిపింది. APలో మొత్తం 63 స్పోర్ట్స్‌ అసోసియేషన్లు ఉండగా.. అందులో శాప్ గుర్తించినవి 35 మాత్రమే. గుర్తింపులేని వాటి తరఫున సర్టిఫికెట్లు సాధించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలుసుకుని గుర్తింపులేని అసోసియేషన్ల తరఫున ఆడొద్దని సూచిస్తున్నారు.

News November 8, 2025

MP సాన సతీశ్‌పై CM చంద్రబాబు ఆగ్రహం!

image

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్‌పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.