News May 20, 2024
వర్క్ హార్స్.. అత్యంత సమర్థవంతమైన హెలికాప్టర్

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్(బెల్-212)ను USకు చెందిన బెల్ టెక్స్ట్రాన్ కంపెనీ తయారు చేసింది. ఇందులో సిబ్బంది సహా గరిష్ఠంగా 15 మంది ప్రయాణించవచ్చు. రెండు బ్లేడ్లతో ఉండే ఈ హెలికాప్టర్‌ను పౌర, వాణిజ్య, సైనిక అవసరాల కోసం వినియోగించుకునేలా రూపొందించారు. కంపెనీ తయారుచేసే కీలక మోడళ్లలో ఇదీ ఒకటి. అత్యంత సమర్థవంతమైనదిగా భావించే ఈ హెలికాప్టర్‌కు ‘వర్క్ హార్స్’గా పేరుంది.
Similar News
News November 20, 2025
కొడంగల్‌కు ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి రాక

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24న కొడంగల్ శివారులోని ఎన్కేపల్లి గేటు వద్ద అక్షయ పాత్ర ఫౌండేషన్ కిచెన్ షెడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. స్థలం పరిశీలనతో అధికారులతో చర్చించారు. అనంతరం హకీమ్పేట్లో ఎడ్యూకేషన్ హబ్ ఏర్పాటు శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించారు.
News November 20, 2025
జగన్ జైలుకెళ్లడం ఖాయం: మంత్రి సత్యకుమార్

AP: పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ కోర్టులను మభ్యపెట్టలేరని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘విచారణలో భాగంగా కోర్టులకు హాజరయ్యేవారు వినయంగా వ్యవహరిస్తారు. తాను కోర్టుకు హాజరైతే సమస్యలు ఎదురవుతాయని కోర్టును నమ్మబలికే ప్రయత్నంలో భాగంగానే HYDలో నానా హంగామా చేశారు. జగన్‌లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకు వెళ్లడం ఖాయం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
News November 20, 2025
పొగిడిన నోళ్లే తిడుతున్నాయ్.. కరెక్టేనా?

రాజమౌళి.. మొన్నటి వరకు తెలుగు సినీ కీర్తిని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన వ్యక్తి. బాలీవుడ్ ఆధిపత్యాన్ని ఎదురించి సౌత్ సినిమాను దేశవ్యాప్తం చేసిన డైరెక్టర్. కానీ ఇప్పుడు.. ఆస్కార్ తెచ్చాడని పొగిడిన నోళ్లే నేలకు దించేస్తున్నాయి. ప్రశంసించిన వాళ్లే విమర్శిస్తున్నారు. ‘దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు’ అన్న ఒకేఒక్క మాట జక్కన్నను పాతాళానికి పడేసిందా? అంతరాత్మ ప్రభోదానుసారం మాట్లాడటం తప్పంటారా? COMMENT


