News March 17, 2024

ఎలుకల మందు సేవించి యువకుడు ఆత్మహత్య

image

సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఎండీ. సమీర్ (22) శనివారం ఎలుకల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Similar News

News November 23, 2025

KMM: డీసీసీ అధ్యక్షుల్లో మంత్రుల అనుచరులకు కీలక స్థానం

image

ఖమ్మం డీసీసీ అధ్యక్షుల నియామకంలో ముగ్గురు మంత్రుల అనుచరులకు పదవులు దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం భట్టి వర్గానికి చెందిన నూతి సత్యనారాయణ, ఖమ్మం టౌన్ అధ్యక్షుడిగా తుమ్మల వర్గం నుంచి నాగండ్ల దీపక్ చౌదరి, కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా మంత్రి పొంగులేటి వర్గానికి చెందిన తోటదేవి ప్రసన్న ఖరారయ్యారు. ఈ నియామకాలతో సామాజిక న్యాయం కూడా జరిగిందనే చర్చ జరుగుతోంది.

News November 23, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఎదులాపురంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన
∆} సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.

News November 23, 2025

ఖమ్మం: రిజర్వేషన్లు కొలిక్కి.. నేడు గెజిట్ విడుదల?

image

ఖమ్మం జిల్లాలోని 571 గ్రామ పంచాయతీలు, 5214 వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఏజెన్సీలో 99 ఎస్టీ పంచాయతీలు ఉండగా, మైదాన ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 49 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ కసరత్తు పూర్తవడంతో నేడు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నవంబర్ 25 లేదా 26 నాటికి రాష్ట్ర నోటిఫికేషన్ వెలువడనుంది.