News April 9, 2025
అక్కాచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన యువకుడు.. షాకిచ్చిన పోలీసులు

AP: శ్రీసత్యసాయి జిల్లాలో అక్కాచెల్లెళ్ల(మైనర్లు)తో ఈ నెల 10న పెళ్లికి సిద్ధమైన యువకుడికి పోలీసులు, ICDS అధికారులు షాకిచ్చారు. అతనితోపాటు ఇరు కుటుంబాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాట వినకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో వివాహాన్ని నిలుపుదల చేశారు. ఇద్దరు యువతులతో పెళ్లికి సంబంధించిన వివాహ పత్రిక 3 రోజులుగా సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.
Similar News
News October 31, 2025
వాడని సిమ్స్‌ను డియాక్టివేట్ చేయండిలా!

చాలామంది ప్రస్తుతం ఒక సిమ్ మాత్రమే వాడుతున్నా ఆధార్ కార్డుపై ఎక్కువ సిమ్స్ యాక్టివ్‌లో ఉంటున్నాయి. ఇలాంటి అనవసరమైన సిమ్ కార్డులను డియాక్టివేట్ చేయడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్‌పై ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకొని, వాటిని క్యాన్సిల్ చేసేందుకు ‘TAFCOP’ పోర్టల్ అందుబాటులో ఉంది. మొబైల్ నం. & ఆధార్‌తో లాగిన్ అయి సిమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అనవసరమైన వాటి డియాక్టివేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు.
News October 31, 2025
CSల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వీధికుక్కల కేసులో అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల CSలు సోమవారం ఫిజికల్‌గా హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వర్చువల్ హాజరుకు అనుమతించాలని SG కోరగా తిరస్కరించింది. GOVT, MNPలు పరిష్కరించాల్సిన అంశాలపై కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడింది. TG, DL, WB మినహా ఇతరులు అఫిడవిట్లు ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.
News October 31, 2025
వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులతో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.


