News November 7, 2024
చికెన్ తిని యువతి మృతి.. వెలుగులోకి కొత్త విషయం

TG: నిర్మల్‌లోని గ్రిల్9 రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తిని యువతి <<14537109>>మరణించిన<<>> ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చికెన్ ఐటమ్స్‌పై మయోనైజ్ వేసుకుని తినడం వల్లే యువతి మరణించిందని, పదుల సంఖ్యలో ఆస్పత్రిపాలయ్యారని అధికారులు తెలిపారు. ఇవాళ ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. కాగా TGలో మయోనైజ్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయినా కొన్ని రెస్టారెంట్లలో దీన్ని వాడుతుండటం గమనార్హం.
Similar News
News October 18, 2025
రాంగోపాల్ వర్మపై కేసు

AP: డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై రాజమండ్రి 3టౌన్ PSలో కేసు నమోదైంది. హిందూ దేవుళ్లు, ఇండియన్ ఆర్మీ, ఆంధ్రులను ఓ ఇంటర్వ్యూలో దూషించారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయనతో పాటు ఇంటర్వ్యూ చేసిన యాంకర్ స్వప్నపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా క్రైమ్ నంబర్ 487/2025 కింద కేసు నమోదైంది. గతంలోనూ RGVపై పలు సందర్భాల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే.
News October 18, 2025
DDAలో 1,732 పోస్టులు.. అప్లై చేశారా?

ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ 1,732 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(స్టేజ్1, స్టేజ్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, Jr ఇంజినీర్, SO, స్టెనోగ్రాఫర్, JSA, మాలి, MTS తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: https://dda.gov.in/. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 18, 2025
వివరాలు ఇవ్వకపోతే ఈనెల జీతం రాదు: ఆర్థిక శాఖ

TG: ఆధార్, ఫోన్ నంబర్లను ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయని ఉద్యోగులకు ఈనెల జీతం రాదని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టేందుకు సమగ్ర సమాచారం కోసం ప్రతినెల 10లోపు ఉద్యోగుల ఆధార్, ఫోన్ నంబర్లను నమోదు చేయాలని గతనెల ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు 5.21లక్షల రెగ్యులర్ ఉద్యోగుల్లో 2.22లక్షల మంది, 4.93లక్షల ఒప్పంద సిబ్బందిలో 2.74లక్షల మంది మాత్రమే వివరాలు అందించారు.