News May 20, 2024
బీజేపీకి 8 సార్లు ఓటేసిన యువకుడు అరెస్ట్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్‌లో బీజేపీ అభ్యర్థికి ఓ యువకుడు 8 సార్లు ఓటేసిన <<13277703>>వీడియో<<>> వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పోలింగ్ బూత్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News November 18, 2025
అనకాపల్లి జిల్లాలో 2,841 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు: సీఎండీ పృథ్వీరాజ్

అనకాపల్లి జిల్లాలో 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,841 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్ సోమవారం తెలిపారు. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు. 500 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.18,000 రాయితీ లభిస్తుందన్నారు. తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వినియోగదారులు PM సూర్యఘర్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పెదాలు పగులుతున్నాయా?

శీతాకాలంలో పెదాలు తరచూ పొడిబారి పగిలిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే వెన్న, నిమ్మరసం, దోస, టమాటా గుజ్జు పూయాలి. లిప్‌బామ్ రాయడం మర్చిపోకూడదు. రాత్రి పడుకునే ముందు నేతితో పెదాలను మర్దనా చేయడం వల్ల కూడా పెదాలు మృదువుగా ఉంటాయి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులనే వాడాలి. అలాగే మంచి పోషకాహారం, తగినంత నిద్ర మిగతా శరీర భాగాల్లాగే పెదాలకూ అవసరం. కాబట్టి జీవనశైలి బావుండేలా చూసుకోవాలి.