News January 21, 2025

A2 నిందితుడికి ప్రజా సొమ్ము ఎలా ఇస్తారు: బొత్స

image

రామతీర్థం బోడికొండపై కోదండ రాముని విగ్రహ ధ్వంసం కేసులో A2 నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 5లక్షలు ఎలా ఇస్తారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆ ఘటనలో నష్టం జరిగిందని బాధితుడికి ప్రజల సొమ్ము ఇవ్వడమేమిటన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు.

Similar News

News February 15, 2025

విశాఖ: కామాంధుడి కోరికలకు వివాహిత బలి

image

గోపాలపట్నంలో శుక్రవారం జరిగిన వివాహిత ఆత్మహత్య ఘటన కలిచివేసింది. తన వికృత చేష్టలతో భార్యను దారుణంగా హింసించిన భర్త.. చివరకు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. పోర్న్ వీడియోలకు బానిసై భార్యతో మానవ మృగంలా ప్రవర్తించాడు. లైంగిక వాంఛకు ప్రేరేపించే మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. మానసికంగా ఎంతో వేదనను అనుభవించిన ఆమె చివరకు ఉరి వేసుకుని తన జీవితానికి ముగింపు పలికింది

News February 14, 2025

VZM: గ్రూప్-2 పరీక్షకు 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

image

APPSC ఆధ్వ‌ర్యంలో ఈ నెల 23న గ్రూప్‌-2 మెయిన్స్ ప‌రీక్ష‌లు జరగనున్నాయి. విజ‌య‌న‌గ‌రంలో మొత్తం 12 ప‌రీక్షా కేంద్రాల‌ను అధికారులు ఏర్పాటు చేశామని జేసీ సేతు మాధవన్ తెలిపారు. ఆ రోజు ఉద‌యం 10 నుంచి 12.30 వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుంచి 5.30 వ‌ర‌కు ప‌రీక్షలు జ‌రుగుతాయి. ప‌రీక్షా కేంద్రం వ‌ద్ద 144 సెక్ష‌న్ ఏర్పాటు చేయాల‌ని, ప‌టిష్ఠమైన పోలీసు బందోబ‌స్తు నిర్వ‌హించాల‌ని జేసీ అధికారులను ఆదేశించారు.

News February 14, 2025

మంత్రి గన్‌మెన్‌ వెంకటరమణను సస్పెండ్ చేసిన ఎస్పీ

image

రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న జి.వెంకటరమణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సస్పెండ్ చేశారు. వెంకటరమణ ఇటీవల సాలూరు నుంచి విజయనగరం వస్తుండగా బుల్లెట్ మ్యాగ్జైన్‌తో ఉన్న బ్యాగ్ మిస్ అయ్యింది. దీంతో ఆయన విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

error: Content is protected !!