News February 6, 2025

ప్రైవేటు కంపెనీలకూ ఆధార్ అథెంటికేషన్ సేవలు

image

కేంద్ర ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ సేవలను ప్రైవేటు సంస్థలకూ విస్తరించింది. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం డిజిటల్ KYCని ఉపయోగించుకొనేందుకు అనుమతించింది. 2025, JAN 31 నుంచే ప్రభుత్వేతర సంస్థలు ఈ సేవలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇది BFSI సెక్టార్లో ఓ గేమ్‌ఛేంజర్ అని UIDAI DyDG మనీశ్ భరద్వాజ్ తెలిపారు. 2010 నుంచి తాము 14000 కోట్ల అథెంటికేషన్ లావాదేవీలను ప్రాసెస్ చేసినట్టు తెలిపారు.

Similar News

News February 6, 2025

ప్రయాగ్‌రాజ్‌లో హరీశ్ రావు దంపతులు

image

TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

News February 6, 2025

రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ

image

AP: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.

News February 6, 2025

BREAKING: భారత్ విజయం

image

ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.

error: Content is protected !!