News October 19, 2024

అక్టోబర్ 22 నుంచి ఆధార్ క్యాంపులు

image

AP: అక్టోబర్ 22 నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లలో 4 రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనుంది. ఇందుకోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి సేవలు అందించనున్నారు.

Similar News

News October 21, 2025

ఇండియా-A జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా పంత్

image

INDలో SA-Aతో ఈనెల 30 నుంచి స్టార్ట్ కానున్న 4 రోజుల మ్యాచ్‌‌లకు BCCI జట్టును ప్రకటించింది. పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
ఫస్ట్ మ్యాచ్ టీమ్: పంత్(C), మాత్రే, జగదీశన్, సుదర్శన్(VC), పడిక్కల్, పాటిదార్, హర్ష్, తనుష్, మానవ్, కాంబోజ్, యశ్, బదోనీ, జైన్
2nd మ్యాచ్: పంత్(C), రాహుల్, జురెల్, సుదర్శన్, పడిక్కల్, గైక్వాడ్, హర్ష్, తనుష్, మానవ్, ఖలీల్, బ్రార్, ఈశ్వరన్, ప్రసిద్ధ్, సిరాజ్, ఆకాశ్

News October 21, 2025

డేంజర్ జోన్‌లోకి ఢిల్లీ ‘గాలి’!

image

దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇవాళ ఉదయం చాణక్య ప్లేస్‌లో AQI 979గా, నారాయణ విలేజ్‌లో 940గా నమోదైంది. దీంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, బయటకొస్తే N95, N99 మాస్కులను తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

News October 21, 2025

నలుగురి గురించి ఆలోచిస్తూ ఉంటే..!

image

నలుగురూ ఏమనుకుంటారో అని భయపడుతున్నారా? ఇది వ్యక్తిగత పురోగతికి ప్రధాన అడ్డంకి అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భయం వల్ల అనేక వినూత్న ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాల్చక, మన మనసులోనే చనిపోతున్నాయని చెబుతున్నారు. దీని నుంచి బయటపడితేనే మనం పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలమని సూచిస్తున్నారు. సొంత ఆలోచనలపై నమ్మకముంచి, నిస్సంకోచంగా ముందుకు సాగడమే విజయానికి తొలిమెట్టు అని నిపుణులు తెలిపారు.