News March 25, 2025

నేటి నుంచే ఆధార్ నమోదు శిబిరాలు

image

AP: రాష్ట్రంలో రెండో విడత ఆధార్ నమోదు క్యాంపులు నేటి నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 6సంవత్సరాలలోపు చిన్నారులు డేట్‌ ఆఫ్‌ బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా నమోదు చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ సైతం ఈ కేంద్రాల వద్ద చేసుకోవచ్చు. ఈ మేరకు అధికారులు గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆధార్ నమోదు చేసుకోని పిల్లల సంఖ్య 1,86,709 ఉన్నట్లు గుర్తించారు.

Similar News

News March 29, 2025

Ghiblistyle: ఏపీ రాజకీయ నాయకుల ఫొటోలు ఇలా..

image

ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీలో ప్రవేశపెట్టిన యానిమేషన్ ఇమేజ్ ఫీచర్ Ghiblistyle సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. యూజర్లు తమకు నచ్చిన ఫొటోలను యానిమేషన్ స్టైల్‌లోకి మార్చుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైఎస్ జగన్ అభిమానులు సైతం ఆయన చిత్రాలను ghiblistyleలోకి మార్చి పోస్టులు చేస్తున్నారు.

News March 29, 2025

Ghiblistyle: ఫొటోలను క్రియేట్ చేసుకోవడం ఎలా?

image

✒ chat.openai.comలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ చాట్ బటన్ క్లిక్ చేయాలి.
✒ తర్వాత మీకు నచ్చిన ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయడం లేదా మీకు కావాల్సిన ఇమేజ్‌ను వివరించాలి.(EX: Show me in Studio Ghibli style)
✒ జనరేట్ ది ఇమేజ్ బటన్ క్లిక్ చేయగానే మీరు కోరుకున్న చిత్రం వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు.
✒ ప్రస్తుతం ఇది ChatGPT Plus, Pro, Team తదితర సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంది.

News March 29, 2025

కొత్త రేషన్‌ కార్డులు, సన్న బియ్యంపై కీలక ప్రకటన

image

TG: అర్హతను బట్టి ఎంతమందికైనా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. ఉగాది రోజున సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 85 శాతం మందికి సన్నబియ్యం అందుతుందని, త్వరలోనే పప్పు, ఉప్పు లాంటి సరకులు కూడా ఇస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!