News May 4, 2024
కుక్కలకూ ఆధార్.. క్యూఆర్ కోడ్‌తో ట్యాగ్‌లు

ఢిల్లీలో కుక్కలకు ఆధార్ కార్డులు ఇస్తున్నారు. Pawfriend.in అనే NGO వీటిని తయారు చేయించి ఇప్పటికే 100 కుక్కలకు జారీ చేసింది. ఇండియా గేట్, ఎయిర్‌పోర్ట్‌లోని టర్మినల్ 1 సహా పలు ప్రాంతాల్లోని కుక్కలకు ఈ కార్డ్‌లు మెడలో వేశారు. వీధి కుక్కల సంరక్షణకు ఇదో మంచి పరిష్కారమని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కుక్కలు తప్పిపోయినా, దాడికి పాల్పడినా QR కోడ్ స్కాన్ చేస్తే ఆ కుక్క ఏ వీధికి చెందినదో తెలుస్తుంది.
Similar News
News December 11, 2025
జైలులో హీరో.. కానీ అభిమానుల సంబరాలు

అభిమాని హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు <<18513197>>దర్శన్<<>> సినిమా ‘ది డెవిల్’ రేపు విడుదల కానుంది. దీంతో ఆయన అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మరోవైపు శివరాజ్‌కుమార్, రిషబ్ శెట్టి వంటి పెద్ద స్టార్‌లు కూడా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తుండటం గమనార్హం. హత్యారోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఉన్న నటుడి సినిమాకు సెలబ్రేషన్స్ నిర్వహించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
News December 11, 2025
CIBC ప్రెసిడెంట్‌తో లోకేశ్ భేటీ

AP: కెనడా- ఇండియా బిజినెస్ కౌన్సిల్(CIBC) ప్రెసిడెంట్ విక్టర్ థామస్‌తో మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు కెనడియన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దీనికి విక్టర్ సానుకూలంగా స్పందించారు. పారిశ్రామికాభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.
News December 11, 2025
మహిళల్లో త్వరగా వృద్ధాప్యం రావడానికి కారణమిదే!

మహిళల్లో జీవ సంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేయడంలో గర్భధారణ కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో స్త్రీలలో జీవశాస్త్రపరంగా గర్భం దాల్చిన స్త్రీలు.. గర్భం దాల్చని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారని గుర్తించారు. పురుషులలో ఇలాంటి జీవసంబంధమైన వృద్ధాప్యం వంటివి లేవని ఈ అధ్యయనం తెలిపింది.


