News July 9, 2025
ఆధార్ తొలి గుర్తింపు కాదు: భువనేశ్

బిహార్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నకిలీ ఓట్లను గుర్తించేందుకు ఆధార్‌ను అనుసంధానించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాగా ఆధార్ కేవలం ఒక ధ్రువీకరణ మాత్రమేనని, అర్హతకు ప్రాథమిక ఆధారం లేదా గుర్తింపు కాదని UIDAI CEO భువనేశ్ కుమార్ స్పష్టం చేశారు. అటు ఫేక్ ఆధార్ కార్డుల కట్టడికీ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నకిలీ ఆధార్‌లను గుర్తించే QR కోడ్ స్కానర్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందన్నారు.
Similar News
News July 9, 2025
నష్టాల్లో ముగిసిన సూచీలు.. 25,500 దిగువకు నిఫ్టీ

భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 83,536 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 25,476 వద్ద స్థిరపడింది. అల్ట్రాటెక్, ఏషియన్ పేయింట్స్, ఎంఅండ్ఎం, ITC, బజాబ్ ఫైనాన్స్, ఎటర్నల్, NTPC, HDFC బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కో, హెచ్‌సీఎల్, ఎల్‌అండ్‌టీ, టైటాన్, ICICI బ్యాంకు షేర్లు నష్టపోయాయి.
News July 9, 2025
తిరుపతి వేదికగా జాతీయ మహిళా సదస్సు: స్పీకర్ అయ్యన్న

APలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో మహిళా సాధికార సభ్యుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది పాల్గొనే ఈ సమావేశాలను తిరుపతి వేదికగా నిర్వహిస్తామన్నారు. అటు ఆగస్టు మొదటి లేదా రెండోవారంలో 10 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్‌చాట్‌లో స్పీకర్ మాట్లాడారు.
News July 9, 2025
రేపు ‘బాహుబలి’ రీరిలీజ్ తేదీ ప్రకటన?

ప్రభాస్& రానా ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకేసారి రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ అయ్యే ఈ చిత్ర తేదీని ప్రత్యేక పోస్టర్ ద్వారా రేపు ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘బాహుబలి’ రిలీజై రేపటికి 10 ఏళ్లు పూర్తికానుంది. కాగా, ‘బాహుబలి వస్తున్నాడు’ అని తాజాగా మేకర్స్ ట్వీట్ చేయడంతో దీనిపై ఆసక్తి పెరిగింది.