News February 21, 2025
24 నుంచి ఆధార్ స్పెషల్ శిబిరాలు

AP: ఈ నెల 24-28 వరకు అన్ని జిల్లాల్లో ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు, పాత వాటిలో మార్పులకు ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా రాష్ట్రంలో ఆరేళ్లలోపు 8.53L మంది, ఆ పైబడిన వారికి సంబంధించి 42.10L మంది ఆధార్ అప్డేట్ నమోదు పెండింగ్లో ఉందన్నారు.
Similar News
News February 22, 2025
ఇంకా ప్రమాదంలోనే పోప్ ఆరోగ్యం

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని ఆయనకు చికిత్స అందిస్తున్న జెమెల్లీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ‘పోప్ న్యుమోనియాతో బాధపడుతున్నారు. బ్రాంకైటిస్గా మొదలైన సమస్య డబుల్ న్యుమోనియాగా మారింది. ఆయనకు విశ్రాంతి అవసరం. కనీసం వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
News February 22, 2025
నేడు మిర్చి యార్డ్, ట్రేడర్లతో సీఎం భేటీ

AP: మిర్చి ధరల అంశంపై సీఎం చంద్రబాబు నేడు మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ధరల పతనంపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తైంది. అందులో 4లక్షల మెట్రిక్ టన్నుల్ని వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
News February 22, 2025
154మంది భారతీయులకు పాకిస్థాన్ వీసాలు జారీ

పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో శ్రీ కటాస్ రాజ్ ఆలయాల్ని సందర్శించేందుకు వస్తున్న 154మంది భారతీయులకు వీసాలు జారీ చేశామని ఆ దేశ హైకమిషన్ శుక్రవారం తెలిపింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2 వరకూ వారు పర్యటిస్తారని పేర్కొంది. ‘ఇరు దేశాల పరస్పర గౌరవం, మతసామరస్యం కోసం ఇలా వీసాలు జారీ చేస్తూనే ఉంటాం’ అని స్పష్టం చేసింది. ప్రతీ ఏటా వేలాదిమంది పర్యాటకులు పాక్లో ఆలయాల సందర్శనం కోసం వెళ్తుంటారు.