News September 10, 2024
రైతులకు వచ్చే నెల నుంచి ఆధార్ తరహా ఐడీ కార్డులు

రైతులకు ఆధార్ తరహాలో ప్రత్యేక ID కార్డులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో అక్టోబర్ నుంచి వీటిని జారీ చేయనుంది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే UP, మహారాష్ట్రలో అమలు చేసింది. మరో 19 రాష్ట్రాలు కూడా ఇందుకు అంగీకరించాయని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ స్కీమ్‌లు, కనీస మద్దతు ధరకు పంటల అమ్మకం, కిసాన్ క్రెడిట్ కార్డు వాడకంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.
Similar News
News October 22, 2025
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 76,343 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 18,768 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.4.34 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
News October 22, 2025
SECLలో 1,138 పోస్టులు.. అప్లై చేశారా?

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ (SECL) 1,138 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. Asst ఫోర్‌మెన్(543 ), మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్(595) పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్ జాబ్లకు OCT 30 అప్లైకి ఆఖరు తేదీ కాగా.. Asst ఫోర్‌మెన్ పోస్టులకు NOV 9 లాస్ట్ డేట్. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి.
*మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 22, 2025
గూగుల్ క్రోమ్‌కు పోటీగా ‘అట్లాస్’

గూగుల్ క్రోమ్‌కు పోటీగా OpenAI ‘అట్లాస్’ అనే సొంత వెబ్ బ్రౌజర్‌ను లాంచ్ చేసింది. AI చాట్‌బాట్ ChatGPT ద్వారా వరల్డ్‌లో మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్‌గా OpenAI ఎదిగింది. ఇప్పుడు యూజర్లను పెంచుకుని డిజిటల్ అడ్వర్టైజింగ్ ద్వారా రెవెన్యూ ఆర్జించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం యాపిల్ ల్యాప్‌టాప్స్‌లో ‘అట్లాస్’ను లాంచ్ చేయగా త్వరలో మైక్రోసాఫ్ట్ విండోస్, యాపిల్ iOS, ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి రానుంది.