News November 8, 2024

ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా?

image

ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు ఆధార్ కార్డు కీలకం. అయితే ఎంతో మంది పదేళ్లు దాటినా వాటిని అప్‌డేట్ చేసుకోవడం లేదు. చిరునామా, ఫొటోలను అప్‌డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు. ఈ నేపథ్యంలో పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు DEC 14 వరకు కేంద్రం గడువునిచ్చింది. ఇదే చివరి గడువు కావొచ్చని ప్రచారం సాగుతోంది. MyAadhaar పోర్టల్‌‌లో లాగిన్ అయి అప్‌డేట్ చేసుకోండి.

Similar News

News November 8, 2024

పోలీసులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ

image

AP: సోషల్ మీడియాలో పోస్టులు, అరెస్టులపై చర్చించేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

News November 8, 2024

భారీ జీతంతో SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు

image

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. ఎస్సైల పే స్కేల్ రూ.35,400-1,12,400, హెడ్ కానిస్టేబుల్ పే స్కేల్ రూ.25,500-81,100గా ఉంది. <>సైట్<<>>: recruitment.itbpolice.nic.in

News November 8, 2024

తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా?: హరీశ్

image

TG: కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదా? రేవంత్ సీఎం అయ్యేవాడా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. KCR ఆనవాళ్లు లేకుండా మూసీ శుద్ధి చేయడం సాధ్యం కాదని అన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలైనా ఒక్క ఇళ్లు కట్టలేదని దుయ్యబట్టారు. కూలగొట్టడం తప్ప నిర్మించడం రేవంత్‌కు తెలియదని మండిపడ్డారు. సీఎం బెదిరింపులకు భయపడమని, ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.